Hillang Yajik: దక్షిణాసియా బాడీబిల్డింగ్‌లో గోల్డ్.. చరిత్ర సృష్టించిన హిల్లాంగ్ యాజిక్

Published : Jun 15, 2025, 06:47 PM IST
Hillang Yajik

సారాంశం

Hillang Yajik: దక్షిణాసియా బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో 1 స్వర్ణం, 1 రజతం గెలిచి హిల్లాంగ్ యాజిక్ చరిత్ర సృష్టించారు. అరుణాచల్‌ మహిళ తొలి మహిళగా రికార్డులకు ఎక్కారు.

South Asian Bodybuilding: అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన హిల్లాంగ్ యాజిక్ 2025 దక్షిణాసియా బాడీబిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. జూన్ 11 నుంచి 15 వరకు భూటాన్ రాజధాని థింఫూలో నిర్వహించబడిన ఈ పోటీలలో ఆమె మహిళల మోడల్ ఫిజిక్ (155 సెంటీమీటర్ల లోపు) విభాగంలో స్వర్ణం, మరో విభాగంలో రజతం గెలుచుకున్నారు. హిల్లాంగ్ యాజిక్ విజయం దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. ఆమె చరిత్రాత్మక గెలుపు భారత మహిళా క్రీడాకారుల సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపిస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్‌కు తొలి అంతర్జాతీయ బాడీబిల్డింగ్ స్వర్ణం

ఈ ఘనత సాధించిన తొలి అరుణాచల్ మహిళగా హిల్లాంగ్ నిలవడం తమకు గర్వకారణమని ముఖ్యమంత్రి పెమా ఖండు పేర్కొన్నారు. “హిల్లాంగ్ అద్భుత ప్రదర్శనకు అభినందనలు! మీ కృషి, శ్రద్ధ, పట్టుదల అరుణాచల్‌కే కాదు, దేశానికీ గౌరవం తీసుకొచ్చాయి” అని ఖండు ట్విట్టర్ (X) ద్వారా ప్రశంసలు కురిపించారు.

 

 

హిల్లాంగ్ యాజిక్‌ కు ప్రముఖుల ప్రశంసలు

దక్షిణాసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన హిల్లాంగ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్‌ చేస్తూ, “భారతదేశానికి ఒక స్వర్ణం, ఒక రజతాన్ని తీసుకొచ్చిన హిల్లాంగ్ యాజిక్‌కి హృదయపూర్వక అభినందనలు. ఆమె చరిత్ర సృష్టించారు” అని పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ సత్నం సింగ్ సంధూ కూడా యాజిక్‌ను అభినందిస్తూ.. “అంతర్జాతీయ బాడీబిల్డింగ్‌లో భారత మహిళలు ముందుకు రావడం గొప్ప క్షణాలు” అని అన్నారు.

 

 

దక్షిణాసియా బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌ 2025

ఈ 15వ దక్షిణాసియా బాడీబిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌ను భూటాన్ బాడీబిల్డింగ్ అసోసియేషన్ నిర్వహించింది. ఇది ప్రపంచ బాడీబిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (WBPF), ఆసియా బాడీబిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ABPF) ద్వారా గుర్తింపు పొందింది. పలు దక్షిణాసియా దేశాల నుంచి అథ్లెట్లు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

అరుణాచల్ బాడీబిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నబాం టునా మాట్లాడుతూ, "హిల్లాంగ్ విజయంతో ఉత్తర తూర్పు భారతదేశం నుంచి మరింతగా యువతులు ఫిజిక్ స్పోర్ట్స్‌లో ఆకర్షితులవుతారు. ఇది ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాకుండా, దేశ ప్రతినిధిగా గొప్ప గౌరవం" అని పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?