అందరి టార్గెట్ ధోనీనే.. ఆఖరికి గంభీర్ కూడా.. మహేంద్రుడి వల్లే జట్టుకు ఈ తిప్పలు

First Published Jul 19, 2018, 12:44 PM IST
Highlights

గత కొద్దిరోజుల నుంచి స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించకపోవడంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అన్ని వైపుల నుంచి ముప్పేట దాడి ఎదుర్కొంటున్నాడు

గత కొద్దిరోజుల నుంచి స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించకపోవడంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అన్ని వైపుల నుంచి ముప్పేట దాడి ఎదుర్కొంటున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ధోనీ బ్యాటింగ్ చూసిన మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ నీ కన్నా నేనే బెటర్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

ఈ పరిణామాల నేపథ్యంలో ధోనీ ఎంపైర్ల నుంచి బాల్ తీసుకోవడంతో మహేంద్రుడు బాల్ తీసుకోవడంతో..  అతను రిటైర్‌మెంట్ చెప్పబోతున్నాడా..? అనే సందేహాలు సైతం వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో అతను తప్పుకుంటేనే  మంచిదనే అభిప్రాయలు సైతం వినిపించాయి. ఇలాంటి సమయంలో ధోనీకి అండగా ఉండాల్సిన అతని సహచర ఆటగాడు, మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కూడా ధోనీని విమర్శిస్తున్నాడు.

ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన మూడు వన్డేల్లోనూ ధోనీ  ఆట తీరును పరిశీలిస్తే.. మహీ చాలా డాట్‌బాల్స్ ఆడాడు. మిగిలిన సమయాల్లో ఓకే కానీ జట్టు కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో అతను నిమ్మళంగా ఆడటం వల్ల మిగతా ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతోందని.. అది జట్టుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుందని గంభీర్ పేర్కొన్నాడు.

click me!