ధోనీ బంతి "మిస్టరీ" వీడింది ... ‘‘ధోనీ మనల్ని వదిలి అప్పుడే వెళ్లడు’’

First Published Jul 19, 2018, 11:37 AM IST
Highlights

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నిర్ణాయాత్మక చివరి వన్డేలో ఓడిపోయిన అనంతరం.. ఆ రోజు ఏ బంతితో మ్యాచ్ జరిగిందో ఆ బంతిని అంపైర్ల నుంచి ధోనీ తీసుకుని మైదానాన్ని వీడటం.. దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నిర్ణాయాత్మక చివరి వన్డేలో ఓడిపోయిన అనంతరం.. ఆ రోజు ఏ బంతితో మ్యాచ్ జరిగిందో ఆ బంతిని అంపైర్ల నుంచి ధోనీ తీసుకుని మైదానాన్ని వీడటం.. దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. గతంలో టెస్టులకు వీడ్కోలు చెప్పే సందర్భంలోనూ అంపైర్ల నుంచి వికెట్లు తీసుకుని.. ఆ తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటించడంతో.. ఆ సందర్భాన్ని ఈ సందర్భంతో పోల్చి.. ధోనీ వన్డేల నుంచి తప్పుకోబోతున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అభిమానులు కూడా ఎవరికి నచ్చినట్లు వారు కామెంట్ చేశారు.. ఈ నేపథ్యంలో  ధోనీ ‘‘బంతి మిస్టరీ’’ని ఛేదించేందుకు టీమిండియా కోచ్ రవిశాస్త్రి రంగంలోకి దిగారు. ఎంఎస్ మనల్ని వదిలి అప్పుడే ఎక్కడికి వెళ్లడం లేదు.. అతడు భారత జట్టుతో ఇంకొంత కాలం ప్రయాణిస్తాడు. ఆ రోజు అంపైర్ల నుంచి బంతిని తీసుకున్న ఉద్దేశ్యం వేరే ఉంది..

మ్యాచ్‌లో బంతితో పడిన ఇబ్బందుల గురించి చెప్పడానికి.. బంతిని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌కు చూపించడానికే తీసుకున్నాడు తప్పించి.. అతనికి ఏ రిటైర్మెంట్ ఉద్దేశం లేదు.. అంటూ రవిశాస్త్రి తెలిపాడు. ఆయన వివరణ ఇచ్చాకా ధోనీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.. 

click me!