ఉప్పల్ స్టేడియంలోకి ఉచిత ప్రవేశం... భారత్,వెస్టిండిస్ మ్యాచ్ సందర్భంగా

By Arun Kumar PFirst Published Sep 25, 2018, 8:04 PM IST
Highlights

మీరు ఏదైనా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ చూడాలనుకుంటే వేలు పోసి టికెట్ కొనుక్కుని గ్రౌండ్ లోకి అడుగుపెట్టాలి. కొన్ని సందర్భాల్లో అలా వేలు పోసినా టికెట్లు దొరికే పరిస్థితి ఉండదు. కానీ వచ్చే నెల హైదరాబాద్ లో జరిగే టెస్టు మ్యాచ్ ని ఓ రోజు ఉచితంగా చూసే అవకాశాన్ని హైదరాబాద్ వాసులకు కల్పించింది హెచ్‌సీఏ. కానీ అందరికి కాకుండా కొన్ని షరతులు విధించింది. 

ఈ బంపర్ ఆఫర్ కేవలం తెలంగాణలోని స్కూల్ విద్యార్థులకు మాత్రమే.  వచ్చే నెల 12వ తేదీ నుండి ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌, వెస్టిండీస్‌ మధ్య టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ను చూసేందుకు స్కూల్‌ విద్యార్థులకు అవకాశం కల్పించాలని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ భావించింది. అందుకోసం ఓ నిర్ణయాన్ని తీసుకుంది. ఐదురోజులు జరిగే ఈ మ్యాచ్ లో ఏదో ఒకరోజు స్కూల్ విద్యార్థులకు ప్రత్యేక అనుమతితో ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు హెచ్‌సిఎ ప్రకటించింది. 

అయితే ఇందుకోసం ముందుగానే తమకు సమాచారం అందించాలని తెలిపింది. వచ్చే నెల ఐదో తేదీ లోపు ఆసక్తిగల పాఠశాల యాజమాన్యాలు తమ విద్యార్థుల లిస్టుతో పాటు వారి వెంట వచ్చే స్కూల్ సిబ్బంది పేరును కూడా హెచ్‌సీఏ సీఈఓ తెలియజేయాలని సూచించింది.  

మరిన్ని వార్తలు

''అంత్యంత సోమరి, బుర్రలేని, ప్రతిభ లేని కెప్టెన్ అతడు''

64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నబీ ఔట్...

click me!