భారత బ్యాట్స్‌మెన్ ఎందుకు విఫలమవుతున్నారంటే..!!

By Siva KodatiFirst Published Feb 3, 2019, 4:33 PM IST
Highlights

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మూడు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ క్లీన్ స్వీన్ చేస్తుందనుకున్న దశలో నాలుగో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ఒక అగ్రశ్రేణి జట్టులా కాకుండా పసికూనలా కివీస్ పేస్‌కు విలవిలలాడింది.

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మూడు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ క్లీన్ స్వీన్ చేస్తుందనుకున్న దశలో నాలుగో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ఒక అగ్రశ్రేణి జట్టులా కాకుండా పసికూనలా కివీస్ పేస్‌కు విలవిలలాడింది.

నాలుగో వన్డేలో ఏదోలే అనుకున్నా చివరి వన్డేలో సైతం భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరడానికి క్యూకట్టారు. అయితే రాయుడు, విజయ్ శంకర్‌, పాండ్యా బాధ్యాతయుతంగా ఆడటం.. ఆ తర్వాత బౌలర్లు కట్టిదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా నామమాత్రంగా గెలిచింది.

భారత బ్యాట్స్‌మెన్ల చెత్త ప్రదర్శనకు కారణం ఏమై ఉంటుందని క్రికెట్ అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే ఇందుకు కారణం స్వింగ్ అంటున్నాడు.. భారత మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్. ఉపఖండపు ఫ్లాట్ పిచ్‌లపై ఆడిన భారత ఆటగాళ్లకు న్యూజిలాండ్‌లోని స్వింగ్ పిచ్‌లపై ఆడటం కష్టంగా మారిందని అభిప్రాయపడ్డాడు.

బంతి స్వింగ్ అయినప్పుడు అంతే వేగంతో వారి ఫుట్‌వర్క్‌ను మన ఆటగాళ్లు మార్చుకోలేకపోతున్నారని.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లలో మన బ్యాట్స్‌మెన్లు విఫలమవ్వడానికి ఇదే ప్రధాన కారణమని ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డాడు.

ఈ రెండు మ్యాచ్‌ల ద్వారా ప్రపంచకప్‌కు ముందు భారత టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌లోని లోపాలు బయటకు వచ్చాయని.. స్వింగ్ పిచ్‌లపై టీమిండియా మరింత కసరత్తు చేయాలన్న విషయం తెలిసొచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఐదో వన్డే: పోరాడిన న్యూజిలాండ్...వెల్లింగ్టన్‌లో భారత్ విజయం
 

click me!