రెచ్చగొట్టే ట్వీట్: పాక్ అభిమానికి దక్షిణాఫ్రికా బౌలర్ కౌంటర్

By sivanagaprasad kodatiFirst Published Feb 3, 2019, 2:57 PM IST
Highlights

తనను రెచ్చగొట్టిన పాక్ అభిమానికి దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ డేల్ స్టెయిన్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. పాక్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు స్టెయిన్ విశ్రాంతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో అతను ‘‘ ఈ టెస్ట్‌ని హాయిగా సోఫాలో కూర్చొని ఆస్వాదిస్తా.. నేనిప్పుడు కుర్చీ విమర్శకుడిని అయ్యాను’’ అంటూ ట్వీట్ చేశాడు

తనను రెచ్చగొట్టిన పాక్ అభిమానికి దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ డేల్ స్టెయిన్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. పాక్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు స్టెయిన్ విశ్రాంతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో అతను ‘‘ ఈ టెస్ట్‌ని హాయిగా సోఫాలో కూర్చొని ఆస్వాదిస్తా.. నేనిప్పుడు కుర్చీ విమర్శకుడిని అయ్యాను’’ అంటూ ట్వీట్ చేశాడు.

దీనిని చూసిన పాక్ అభిమాని ఒకరు ఓవరాక్షన్ చూపించాడు. ‘‘ అవును, ఈ టెస్టులో సిరీస్‌లో నీ బౌలింగ్‌ను బాబర్ ఆజమ్ చితక్కొట్టినప్పుడు...నీకు ఖచ్చితంగా రెస్ట్ కావాల్సిందే’’నంటూ వ్యంగ్యంగా రిప్లై ఇచ్చాడు.

దీనిపై మండిపడిన స్టెయిన్ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. ‘‘అవును టెస్ట్ సిరీస్ 3-0 తేడాతో గెలవడమే నిజంగా చితక్కొట్టించుకోవడమే’’నంటూ చురకలు వేశాడు. ఈ రిప్లై పై నెటిజన్లు కామెంట్లు చేశారు. మైదానంలో తన పదునైన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పలు పెట్టే స్టెయిన్.. సోషల్ మీడియాలోనూ బౌన్సర్లు సంధిస్తున్నాడంటూ ట్వీట్ చేశారు.

బాబర్ ఆజమ్ నిన్న గాక మొన్నొచ్చిన బచ్చా అని.. ఒక దిగ్గజం గురించి కామెంట్ చేసే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ ట్రోలింగ్‌తో నష్టనివారణా చర్యలు చేపట్టిన పాకిస్తాని అభిమాని.. ‘‘తాను తన దేశం పరువు తీసినందుకు క్షమించండి... నాకు స్టెయిన్ రిప్లై కోసమే అలా చేశాను ’’ అంటూ మరోసారి ట్వీట్ చేశాడు.

click me!