తనను విమర్శించిన పాక్ మాజీ కెప్టెన్‌పై గంగూలీ ప్రశంసలు

By Arun Kumar PFirst Published Feb 25, 2019, 6:43 PM IST
Highlights

పుల్వామా దాడి సేపథ్యంలో భారత్-పాక్ దేశాల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంది. తమ సైనికులపై దాడికి దిగిన  జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు పాక్ ఆశ్రయం కల్పిస్తోంది. అంతేకాదు పుల్వామా దాడిని పాక్ సాయంతోనే ఉగ్రవాదులు జరిపినట్లు భారత్ గుర్తించింది. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలే కాదు క్రీడా సంబంధాలు కూడా మరింత దిగజారాయి. 
 
ఈ క్రమంలో ఇరుదేశాల క్రీడాకారుల మధ్య మాటలయుద్దం కూడా తారాస్థాయికి చేరింది. పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాకిస్ధాన్ విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. అయితే గంగూలీ విమర్శలకు పాక్ జట్టు మాజీ కెప్టెన్ మియాందాద్ అంతే ఘాటుగా సమాధానమిచ్చారు. అయితే మియాందాద్ తనపై చేసిన విమర్శలపై తాజాగా గంగూలీ స్పందించారు. 

తనపై మియాందాద్ చేసిన విమర్శలపై ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదని గంగూలీ అన్నారు. అయితే మియాందాద్ ఆటతీరును తాను చాలా ఇష్టపడేవాడినని పేర్కొన్నారు. అతడి బ్యాటింగ్ ను బాగా ఆస్వాదించేవాడినని తెలిపారరు. పాకిస్థాన్ క్రికెటర్లందరిలో అతడో అద్భుతమైన ఆటగాడని గంగూలి ప్రశంసించాడు.  

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై వచ్చే ఎన్నికల కోసమే పరుగులు తీస్తున్నారని మియాందాద్ విమర్శలకు దిగాడు. గంగూలీ సీఎం కావాలని కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రచారం కోసం గంగూలీ ఏదోదో మాట్లాడుతున్నారని ఆరోపించారు. అందుకోసమే పుల్వామా ఘటనను అడ్డం పెట్టుకుని పాక్ పై నిందలు వేస్తున్నాడని మియాందాద్ తీవ్రంగా విమర్శించాడు.    

click me!