ఒక్క సైగతో దేశభక్తిని చాటుకున్న కోహ్లీ...విశాఖ స్టేడియం సాక్షిగా

By Arun Kumar PFirst Published Feb 25, 2019, 3:33 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ స్టేడియం సాక్షిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన దేశభక్తిని చాటుకున్నాడు. పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన వీర జవాన్లకు టీ20 మ్యాచ్ ఆరంభానికి ముందు ఆటగాళ్లు నివాళులర్పించారు. ఆ సమయంలోనే స్టేడియంలో కిక్కిరిసిన అభిమానులను ఒక్క సైగ చేయడం ద్వారా కోహ్లీ అమర జవాన్ల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. 

భారత్-ఆస్ట్రేలియా జట్లు మధ్య ఆదివారం టీ20 సీరిస్ ప్రారంభమైన విషయం తెలిసిందే. విశాఖ పట్నం స్టేడియంలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ కు ముందు భారత  ఆటగాళ్లు పుల్వామా సైనికుల మృతికి నివాళుల్పించారు.  నల్ల బ్యాడ్జీలు ధరించి  మైదానంలో అడుగుపెట్టిన ఆటగాళ్లు జాతీయ గీతాలాపన పూర్తికాగానే అమర సైనికులను  ఆత్మశాంతికోసం రెండు నిమిషాలు మైనం పాటించారు. 

 ఆటగాళ్లతో పాటు స్టేడియంలోని అభిమానులందరు కూడా నిలబడి మౌనం పాటించారు. అయితే ఈ సమయంలో కొందరు అభిమానులు మాత్రం అత్యుత్సాహంతో భారత్ మాతాకి జై అంటూ నినదించడం ప్రారంభించారు. దీంతో కాస్త  అసహనానికి గురైన కోహ్లీ ఆ నినాదాలు చేస్తున్నవారికి మౌనంగా వుండాలంటూ సైగ చేశాడు.

కోహ్లీ ఇలా అభిమానులను కేవలం సైగల ద్వారా కట్టడి చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ గా మారడమే కాదు...కోహ్లీ దేశభక్తిని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆయన జట్టు సారథిగానే ఆటగాళ్లకే కాదు స్టేడియంలోని అభిమానులకు కూడా దిశానిర్దేశం చేస్తున్నాడంటూ కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు.  

click me!