‘‘ముందురోజు ఇలా, తర్వాతి రోజు’’ ఇలా: ధావన్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు

Siva Kodati |  
Published : Feb 25, 2019, 06:31 PM IST
‘‘ముందురోజు ఇలా, తర్వాతి రోజు’’ ఇలా: ధావన్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు

సారాంశం

పేలవంగా ఆడి జట్టును ఓడించారంటూ ఇప్పటికే మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ధోనీ, చివరి ఓవర్లో చెత్త బౌలింగ్ చేశాడంటూ పేసర్ ఉమేశ్ యాదవ్‌లపై మండిపడుతున్నారు. చివరికి మ్యాచ్‌తో ఏమాత్రం సంబంధం లేని ఓపెనర్ శిఖర్ ధావన్‌ను సైతం వదలడం లేదు. 

విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో గెలవాల్సిన మ్యాచ్‌ను భారత్ చేజార్చుకోవడంపై అభిమానులు రగిలిపోతున్నారు. పేలవంగా ఆడి జట్టును ఓడించారంటూ ఇప్పటికే మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ధోనీ, చివరి ఓవర్లో చెత్త బౌలింగ్ చేశాడంటూ పేసర్ ఉమేశ్ యాదవ్‌లపై మండిపడుతున్నారు.

చివరికి మ్యాచ్‌తో ఏమాత్రం సంబంధం లేని ఓపెనర్ శిఖర్ ధావన్‌ను సైతం వదలడం లేదు. విశాఖ మ్యాచ్‌కు ఒక రోజు ముందు ‘‘రేపటి పోరుకు సర్వ సన్నద్ధం’’ అంటూ ప్రాక్టీస్ ముగించుకుని వస్తున్న తన ఫోటోను శిఖర్ ట్వీట్ చేశాడు.

ఆ తర్వాతి రోజు తుది జట్టులో అతనికి స్థానం దక్కలేదు. పెవిలియన్‌లో కూర్చొని మ్యాచ్ మధ్యలో సహచరులకు బ్యాట్లు, కూల్‌డ్రింకులు అందజేస్తూ ఫోటోలకు చిక్కాడు.

దీంతో ఈ రెండు ఫోటోలను అడ్డు పెట్టుకుని అభిమానులు శిఖర్ ధావన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. విశాఖ మ్యాచ్‌లో తనను తీసుకోనందుకు ధావన్ చాలా సంతోషపడి వుంటాడని ఒకరు.... భారత్ ఓడిపోతుందని తెలిసి జట్టులోకి రాలేదని మరోకరు కామెంట్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?