ఇరగదీసిన జడేజా: భారత్ స్కోర్ 292 పరుగులు

By pratap reddyFirst Published 9, Sep 2018, 9:38 PM IST
Highlights

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భారత్ పరువు నిలబెట్టాడు. 156 బంతుల్లో 1 సిక్స్, 11 ఫోర్ల సాయంతో జడేడా 86 పరుగులు చేశాడు. దాంతో విహారీ కూడా అర్థ సెంచరీ చేయడంతో భారత్ ఇంగ్లాండుపై జరిగిన ఐదో టెస్టు మ్యాచులో 292 పరుగులు చేసింది.

లండన్: ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భారత్ పరువు నిలబెట్టాడు. 156 బంతుల్లో 1 సిక్స్, 11 ఫోర్ల సాయంతో జడేడా 86 పరుగులు చేశాడు. దాంతో విహారీ కూడా అర్థ సెంచరీ చేయడంతో భారత్ ఇంగ్లాండుపై జరిగిన ఐదో టెస్టు మ్యాచులో 292 పరుగులు చేసింది. 
 
జడేజా చెలరేగిపోయి స్కోరు బోర్డును పెంచాడు. టాప్ ఆర్డర్ తడబాటుకు గురైన స్థితిలో హనుమ విహారీతో కలిసి జడేజా అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అయితే 56 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విహారీ పెవిలియన్ చేరాడు. 

జడేజా 113 బంతుల్లో 9 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. ఆ తర్వాత మైదానంలో తన ఫేమస్ స్వార్ట్ సెలబ్రేషన్ చేశాడు. డ్రెస్సింగ్ రూం నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లు జడేజా ఇన్నింగ్స్‌ని కరతాళ ధ్వనులతో అభినందించారు.
 
భారత్ బ్యాటింగ్‌లో జడేజా 86, హనుమ విహారీ 56, విరాట్ కోహ్లీ 49, కెఎల్ రాహుల్ 37 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలింగ్‌లో ఆండర్‌సన్, స్టోక్స్, అలీ తలో రెండు, బ్రాడ్, కర్రన్, రషీద్ తలో వికెట్ తీశారు. 

ఈ వార్తాకథనాలు చదవండి

ఇరగదీసిన జడేజా: భారత్ స్కోర్ 292 పరుగులు

పస లేని భారత్ బ్యాటింగ్: స్కోరు 174/6

విహారి అర్థసెంచరీ.. తొలి టెస్టులోనే హాఫ్ సెంచరీ చేసిన ఆంధ్రా కుర్రాడు

ఆదుకున్న బట్లర్, బ్రాడ్: ఇంగ్లాండు స్కోరు 332

Last Updated 9, Sep 2018, 9:50 PM IST