ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై భారీ స్కోరు సాధించింది. శుభ్‌మన్ గిల్ (90), సాయి సుదర్శన్ (52), జోస్ బట్లర్ (41) రాణించడంతో జిటి 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.
IPL 2025 GT vs KKR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ లోడ్ అవుతోంది. ఈడెన్ గార్డెన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లతో గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్ చెడుగుడు ఆడుకుంది. జిటి ఓపెనర్లు శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన మొదటి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ కేవలం 55 బంతుల్లో 90 పరుగులు సాధించాడు... సెంచరీకి కేవలం 10 పరుగుల దూరంలో ఆగిపోయాడు. పది ఫోర్లు, 3 సిక్సర్లతో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ కూడా తనదైన స్టైల్ దూకుడుతో హాఫ్ సెంచరీ బాదాడు... కేవలం 36 బంతుల్లోనే 52 పరుగులు పూర్తిచేసుకున్నాడు.
ఓపెనర్లు శుభారంభం అందించడంతో గుజరాత్ బ్యాట్ మెన్స్ ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం రాలేదు. సాయి సుదర్శన్ ఔటయినా క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ అదే ఊపును కొనసాగించాడు. కేవలం 23 బంతుల్లోనే 41 పరుగులు బాదాడు... ఇందులో 8 ఫోర్లు ఉన్నాయి. చివర్లో తెవాటియా కేవలం 5 బంతుల్లో 11 పరుగులు చేసాడు.
ఇలా గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్ రాణించడంతో కేవలం 3 వికెట్ల నష్టానికి నిర్ణీత ఓవర్లలో 198 పరుగులు చేయగలిగింది. గిల్ సెంచరీ మిస్ అయినా టీంకు భారీ స్కోరు అందించాడు. కోల్ కతా బౌలర్లు జిటి దూకుడును అడ్డుకోవడంలో విఫలమయ్యారు... మరి బ్యాట్ మెన్స్ 199 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని చేధించడంలో సక్సెస్ అవుతారో లేక చేతులెత్తేస్తారో మరికొద్దిసేపట్లో తేలనుంది.
కోల్ కతా నైట్ రైడర్స్ ఏ దశలోనూ గుజరాత్ బ్యాట్ మెన్స్ ను సమర్ధవంతంగా ఎదుర్కోలేదు... బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు సరైన సమయానికి వికెట్లు పడగొట్టలేకపోయారు.
వైభవ్ అరోరా 4 ఓవర్లేసి 44 పరుగులు సమర్పించుకున్నాడు... కేవలం 1 వికెట్ పడగొట్టాడు. ఇక హర్షిత్ రాణా కూడా 4 ఓవర్లలో 45 పరుగులిచ్చి 1 వికెట్ తీసాడు. రస్సెల్ ఒకే ఓవర్లో 13 పరుగులు ఇచ్చాడు... కానీ 1 వికెట్ పడగొట్టాడు. మోయిన్ వికెట్లేవీ తీయకున్నా 3 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 33, నరైన్ 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేకపోయారు.