
ఆస్ట్రేలియా పిచ్‌లపై దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ తన అద్భుత బ్యాటింగ్‌తో మరోసారి సంచలనం సృష్టించాడు. ఇప్పటికే రెండో టీ20లో శతకంతో చెలరేగిన ఈ జూనియర్ ఏబీడీ, ఇప్పుడు సిరీస్ డిసైడర్‌లోనూ అదే ధాటిని కనబరిచాడు. కెయిర్న్స్‌లోని కాజాలి స్టేడియం వేదికగా జరిగిన మూడో టీ20లో అతడు ఆస్ట్రేలియా బౌలర్లను చీల్చి చెండాడాడు.
బ్రెవిస్ ఇన్నింగ్స్‌లో ముఖ్య ఘట్టం పదో ఓవర్‌లో జరిగింది. ఆ ఓవర్ వేసిన ఆసీస్ యువ బౌలర్ ఆరోన్ హార్డీకి వరుసగా నాలుగు సిక్స్‌లు బాదాడు. అదికాకుండా, స్పీడ్ స్టార్ బెన్ ద్వార్షుయిస్ బౌలింగ్‌లో 100 మీటర్లకు సిక్స్‌ను బాదాడు. బంతి నేరుగా స్టేడియం బయటపడింది.
బ్రెవిస్ బ్యాటింగ్ శైలి, అతడి షాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కేవలం 26 బంతులు ఎదుర్కొన్న బ్రెవిస్ 6 సిక్స్‌లు, ఒక బౌండరీతో వేగంగా 53 పరుగులు సాధించాడు. అతడి ఈ ఇన్నింగ్స్ దక్షిణాఫ్రికాకు కీలకంగా మారింది.
ముందుగా టాస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. బ్రెవిస్‌తో పాటు వాన్ డర్ డస్సెన్ (38), ట్రిస్టన్ స్టబ్స్ (25) జట్టుకు విలువైన రన్స్ అందించారు. ఆస్ట్రేలియా వైపు నుంచి నాథన్ ఎల్లిస్ బాగా రాణించాడు. అతడు మూడు వికెట్లు తీయగా, జంపా, హాజిల్‌వుడ్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. అయినప్పటికీ బ్రెవిస్ తుపాన్ ఇన్నింగ్స్ ముందు ఆసీస్ బౌలర్లు తట్టుకోలేకపోయారు.