Vece Paes: లియాండర్‌ పేస్‌కు పితృవియోగం.. ఒలింపియన్ వేస్ పేస్ కన్నుమూత

Published : Aug 14, 2025, 01:54 PM IST
Vece Paes and his son Leander Paes

సారాంశం

Former Olympian Vece Paes: భారత టెన్నిస్ స్టార్ లియాండర్‌ పేస్‌ తండ్రి, ఒలింపియన్ వేస్ పేస్ కన్నుమూశారు. ఆయన హాకీ జట్టు తరపున కాంస్యం గెలవడమే కాకుండా, స్పోర్ట్స్ మెడిసిన్‌లో నిపుణులు కూడా.

DID YOU KNOW ?
ఒలింపిక్స్ లో పేస్
వేస్ పేస్ 1972లో హాకీ కాంస్యం, కుమారుడు లియాండర్ 1996లో టెన్నిస్ కాంస్యం గెలిచారు. ఒలింపిక్ పతకాలు గెలిచిన భారత ఏకైక తండ్రి-కొడుకులు.

Former Olympian Vece Paes: భారత మాజీ హాకీ ప్లేయర్, ఒలింపియన్ డాక్టర్ వేస్‌ పేస్ కన్నుమూశారు. బుధవారం నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. వేస్ చనిపోయే సమయంలో లియాండర్ పేస్ ఆయన పక్కనే ఉన్నారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వేస్ శరీరంలోని అనేక అవయవాలు పనిచేయడం మానేశాయి. వైద్యులు ఆసుపత్రిలో చేర్పించాలని సూచించారు. కానీ ప్రాణాలు దక్కలేదు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు వేస్ తుది శ్వాస విడిచారు.

వేస్ 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టు సభ్యుడుగా ఉన్నారు. టెన్నిస్ క్రీడాకారుడు లెండర్ పేస్ తండ్రి వేస్ పేస్ 80 ఏళ్ల వయసులో మరణించారు. మీడియా కథనాల ప్రకారం, వేస్ పేస్ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం ఆయనను నగరంలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు.

 

 

క్రీడానిపుణులు వేస్ పేస్

వేస్ పేస్ కు భారతీయ క్రీడలతో దీర్ఘకాల సంబంధం ఉంది. ఆయన పర్యవేక్షణలో చాలా మంది క్రీడాకారులు వివిధ క్రీడల్లో రాణించే అవకాశం పొందారు. వేస్ భారతీయ క్రీడలకు ఎంతో సేవ చేశారు. ఆయన భారత హాకీ జట్టులో మిడ్‌ఫీల్డర్‌గా ఆడేవారు. అంతేకాకుండా, ఫుట్‌బాల్, క్రికెట్, రగ్బీ వంటి అనేక క్రీడల్లో కూడా పాల్గొన్నారు. వేస్ పేస్ 1996 నుంచి 2002 వరకు ఇండియన్ రగ్బీ ఫుట్‌బాల్ యూనియన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

బీసీసీఐ తో కలిసి పనిచేసిన వేస్ పేస్

స్పోర్ట్స్ మెడిసిన్ వైద్యుడిగా, ఆయన ఆసియా క్రికెట్ కౌన్సిల్, భారత క్రికెట్ బోర్డు, భారత డేవిస్ కప్ జట్టుతో సహా అనేక క్రీడా సంస్థలకు వైద్య సలహాదారుడిగా పనిచేశారు.

వేస్ కుమారుడు లియాండర్ పేస్ కూడా ఒలింపిక్ పతక విజేత

1972లో వేస్ పేస్ ఒలింపిక్ పతకం సాధించిన 24 ఏళ్ల తర్వాత, 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్ భారత టెన్నిస్‌కు తొలి, ఏకైక పతకాన్ని అందించారు. లియాండర్ పేస్ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్నారు. 1952 తర్వాత ఒలింపిక్ వ్యక్తిగత ఈవెంట్‌లో ఇది భారత్‌కు తొలి పతకం. 

కె.డి. జాదవ్ 1952లో ఈ ఘనత సాధించారు. వేస్ తరచుగా తన కొడుకును ప్రశంసిస్తూ ఉండేవారు. లియాండర్ విజయం గురించి వేస్ మాట్లాడుతూ, 'ముందుగా, లియాండర్ క్రీడా సంస్కృతిని ప్రోత్సహించే వాతావరణంలో పెరిగాడు. అంతేకాకుండా, అతనికి సహజ ప్రతిభ ఉంది' అని అన్నారు.

అలాగే, 'టెన్నిస్ కోర్టులో లియాండర్ చాలా వేగంగా ఉంటాడు, మొండివాడు అని నేను అనుకుంటున్నాను.  వారంలో ఆరు రోజులు, రోజుకు మూడు గంటలు ప్రాక్టీస్ చేసేవాడు. నువ్వు ఛాంపియన్ కావాలంటే, నువ్వు దీన్ని కొనసాగించాలి' అన్నారు. 'ఎప్పుడూ ఓటమిని అంగీకరించకు' అనే వైఖరి తన కుటుంబంలో ఉందని లియాండర్ పేస్ నమ్ముతారు. లియాండర్ మాట్లాడుతూ, 'ఇదంతా వారసత్వంగా వచ్చింది' అని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?