క్రిస్‌గేల్‌ను తప్పించిన విండీస్ బోర్డ్.. గేల్ ప్లేస్‌లో మరోకరి ఎంపిక

First Published Jul 31, 2018, 1:19 PM IST
Highlights

వన్డేలైనా, టెస్టులైనా, టీ20లైనా ఒకేలా ఆడటం అతని స్టైల్. గేల్‌ను వీలైనంత త్వరగా పెవిలియన్‌కు పంపకపోతే జరిగే నష్టం ఊహాకు కూడా అందదు. అలాంటి క్రిస్‌గేల్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ముఖ్యంగా ఐపీఎల్‌లో గేల్ ముద్ర మరువలేనిది. అలాంటి ఆటగాడికి విండీస్ క్రికెట్ బోర్డ్ ఉద్వాసన  పలికింది

క్రికెట్ ప్రపంచంలోని అత్యంత విధ్వంసకర క్రికెటర్లలో క్రిస్‌గేల్ పేరు ముందువరుసలో ఉంటుంది. వన్డేలైనా, టెస్టులైనా, టీ20లైనా ఒకేలా ఆడటం అతని స్టైల్. గేల్‌ను వీలైనంత త్వరగా పెవిలియన్‌కు పంపకపోతే జరిగే నష్టం ఊహాకు కూడా అందదు. అలాంటి క్రిస్‌గేల్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు.

ముఖ్యంగా ఐపీఎల్‌లో గేల్ ముద్ర మరువలేనిది. అలాంటి ఆటగాడికి విండీస్ క్రికెట్ బోర్డ్ ఉద్వాసన  పలికింది. బంగ్లాదేశ్‌తో త్వరలో జరగబోయే టీ20 జట్టులో గేల్ స్థానం కోల్పోయాడు. ఈ మేరకు 13 మందితో కూడిన జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. అతని స్థానంలో పేసర్ షెల్డాన్ కోట్రెల్‌కు చోటు కల్పించింది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు గేల్‌కు విశ్రాంతినిచ్చామని.. అతని స్థానంలో షెల్డాన్ ఉంటారని విండీస్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ కర్టనీ బ్రౌన్ తెలిపారు.

click me!