ఆఫ్రిదిని సమం చేసిన క్రిస్‌గేల్

First Published Jul 30, 2018, 12:26 PM IST
Highlights

విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్‌ మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు.. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా పాక్ మాజీ కెప్టెప్ షాహిద్ ఆఫ్రిదితో కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో 73 పరుగులు చేసిన గేల్... 6 ఫోర్లు, 5 సిక్సర్లు నమోదు చేశాడు.. 5వ సిక్సర్ ద్వారా తన కెరీర్‌లో 476వ సిక్సర్‌ను ఖాతాలో వేసుకుని ఆఫ్రిది అత్యధిక సిక్సర్ల రికార్డును సమం చేశాడు. వీరి తర్వాత బ్రెండన్ మెక్‌కల్లమ్(398), సనత్ జయసూర్య(352), ఎంఎస్ ధోనీ(342), డివిలియర్స్(328), రోహిత్ శర్మ( 291), మార్టిన్ గప్టిల్ (274), సచిన్ (264) ఉన్నారు. క్రిస్‌గేల్ కెరీర్ మరికొంతకాలం ఉన్నందున అతని ఖాతాలో మరికొన్ని సిక్సర్లు చేరే అవకాశం ఉంది.

click me!