ఇంగ్లాండ్‌ను వణికించిన ఇషాంత్.. కోహ్లీసేన టార్గెట్ 194

First Published Aug 3, 2018, 11:51 PM IST
Highlights

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ టీమిండియాకు ముందు 194 పరుగుల లక్ష్యాన్ని వుంచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ను టీమిండియా బౌలర్లు వణికించారు.

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ టీమిండియాకు ముందు 194 పరుగుల లక్ష్యాన్ని వుంచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ను టీమిండియా బౌలర్లు వణికించారు. తొలుత స్పిన్ ఆ తర్వాత పేస్‌తో ఆటాడుకున్నారు. 13 పరుగుల ఆధిక్యంతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌ను స్పిన్నర్ అశ్విన్ తన మాయాజాలంతో బోల్తా కొట్టించాడు. అలిస్టర్ కుక్, జెన్నింగ్స్, జో రూట్‌లను పెవిలియన్ పంపించాడు.

అనంతరం రంగంలోకి దిగిన ఇషాంత్ శర్మ.. రెండు వైపులా బంతిని స్వింగ్ చేస్తూ పదునైన బంతులతో ఇంగ్లాండ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు.. డేవిడ్ మలన్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్‌లను ఔట్ చేశాడు. లంచ్ విరామానికి 86/6 పరుగులతో కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్‌ను బౌలర్ శామ్ కరన్ ఆదుకున్నాడు.. భారీ షాట్లతో విరుచుకుపడిన కరన్ 9 ఫోర్లు, 2 సిక్సర్లతో వన్డే తరహా ఆటను ఆడాడు..

కేవలం 65 బంతుల్లోనే 63 పరుగులు చేసి భారత బౌలర్లను విసిగించాడు.. మరో బౌలర్ రషీద్‌తో 48, బ్రాడ్‌తో కలిసి 41 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించేందుకు సాయపడ్డాడు.. చివరికి ఉమేశ్ యాదవ్ కరన్‌ను ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 180 పరుగు9లకు అలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో ఇషాంత్ 5, అశ్విన్ 3, ఉమేశ్ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యాన్ని చేధించేందుకు రంగంలోకి దిగిన భారత్ 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి జట్టును ఒడ్డున పడేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. 

click me!