ధోనీ లేడు.. అందుకే ఓడిపోయాం.. మాజీ క్రికెటర్

By ramya NFirst Published Mar 12, 2019, 11:02 AM IST
Highlights

ఆస్ట్రేలియాతో జరగుతున్న వన్డే సరిస్ లో రెండు మ్యాచ్ లు భారత్ కైవసం చేసుకున్నా.. చివరి రెండు మ్యాచ్ లో ఆసిస్ చేతిలో టీం ఇండియా పరాజయం పాలైంది.

ఆస్ట్రేలియాతో జరగుతున్న వన్డే సరిస్ లో రెండు మ్యాచ్ లు భారత్ కైవసం చేసుకున్నా.. చివరి రెండు మ్యాచ్ లో ఆసిస్ చేతిలో టీం ఇండియా పరాజయం పాలైంది. అయితే.. మొహాలీలో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్ లో ధోనీ లేకపోవడం కారణంగానే మ్యాచ్ ఓడిపోయాం అని మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ అభిప్రాయపడ్డారు.

చివరి రెండు మ్యాచ్ లలో ధోనికి ఎందుకు విశ్రాంతి ఇచ్చారని బిషన్ సింగ్ బేడీ ప్రశ్నించారు. ధోని లేని లోటు ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనబడిందని, వికెట్ల వెనుకాలా ఉండి ప్రశాంతంగా అతను రచించే వ్యూహాలు ఈ మ్యాచ్‌లో మిస్సయ్యాయని, కోహ్లి కూడా ధోని సూచనలు లేక అయోమయానికి గురయ్యాడని అన్నారు.

తాను ఎవరిపైనా  కామెంట్‌ చేయదల్చుకోలేదన్నారు. కానీ ధోనికి విశ్రాంతినివ్వడమే ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు.  కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌, దాదాపు సారథిగా అతని సేవలు జట్టు కోల్పోయిందని అభిప్రాయపడ్డారు.

 ధోని యువకుడు కాకపోవచ్చు. కానీ అతను జట్టుకు అవసరమన్నారు.  అతను ప్రశాంతంగా ఆటగాళ్లను ప్రభావితం చేయగలడని చెప్పారు.  ప్రస్తుత సారథికి కూడా అతని సూచనలు అవసరమన్నారు. ధోనీ లేకపోవడం వల్ల  కోహ్లి మొరటుగా కనిపించాడన్నారు.
 

click me!