మెల్బోర్న్ టెస్ట్: తప్పులో కాలేసిన విరాట్ కోహ్లీ

By pratap reddyFirst Published Dec 28, 2018, 12:55 PM IST
Highlights

తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో 7 వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసి భారత్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టును 151 పరుగులకే కుప్పకూల్చింది. దాంతో 292 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది.

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పులో కాలేసినట్లే కనిపిస్తున్నాడు. ఆయన నిర్ణయం భారత జట్టుకు ప్రతికూలంగా మారినట్లు తోస్తోంది. 

తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో 7 వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసి భారత్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టును 151 పరుగులకే కుప్పకూల్చింది. దాంతో 292 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది.
 
ఆసీస్‌ను ఫాలోఆన్‌ ఆడించే అవకాశం ఉన్నప్పటికీ భారత్‌ అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించి చేతులు కాల్చుకున్నట్లు అంచనా వేస్తున్నారు. వరుసగా వికెట్లు కోల్పోతూ ఆసీస్‌ ఆటగాళ్లకు మ్యాచ్‌పై ఆశలు రేకిత్తించింది.

హనుమ విహారి(13) వికెట్‌ పడిన తర్వాత వరుసగా పుజారా (0), కోహ్లి (0), రహానే(1), రోహిత్‌ (5) పరుగుల వేటలో చతికలపడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన పుజారా, హాఫ్‌ సెంచరీ సాధించిన కోహ్లిలు పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరుకున్నారు. 

ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 5 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్‌ అగర్వాల్‌ (28), రిషభ్‌ పంత్‌ (6) ఉన్నారు. మూడో రోజు ఆటలో మొత్తం 15 వికెట్లు పడటం పడ్డాయి. 

 ఆసీస్‌ను ఫాలోఆన్‌ ఆడిస్తే ఒత్తిడిలో త్వరగా వికెట్లు కోల్పోయేదని, అప్పుడు భారత్‌ ఇన్నింగ్స్‌ తేడాతో గెలిచే అవకాశం ఉండేదని క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

మెల్బోర్న్ టెస్ట్: ముగిసిన 3వ రోజు ఆట, భారత్ విలవిల

ఆసిస్ కెప్టెన్ కి రోహిత్ శర్మ బంపర్ ఆఫర్

మెల్బోర్న్ టెస్టు: బుమ్రా దెబ్బకు "కంగారె"త్తారు

మెల్బోర్న్ టెస్టు: 435 పరుగుల వెనుకంజలో కంగారూలు

కొట్టు, చూద్దాం: రోహిత్ శర్మను రెచ్చగొట్టిన పైన్ (చూడండి)

click me!