మెల్బోర్న్ టెస్టు: బుమ్రా దెబ్బకు "కంగారె"త్తారు

By pratap reddyFirst Published Dec 28, 2018, 7:58 AM IST
Highlights

మూడో రోజు శుక్రవారం 8/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో బ్యాటింగ్‌కి దిగిన పైన్‌సేన ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. 11 ఓవరులో ఇషాంత్‌ వేసిన బంతిని మయాంక్‌ అగర్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఓపెనర్‌ ఫించ్‌ ఔటయ్యాడు. 

మెల్‌బోర్న్‌:  బాక్సింగ్ డే టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో భారత బౌలర్ బుమ్రా ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. ఆరు వికెట్లు తీసుకుని ఆస్ట్రేలియాను అతి తక్కువ స్కోరుకు ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా కేవలం 151 పరుగులకే ఆలౌట్ అయింది.భారత బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లు తీసుకోగా, జడేజాకు రెండు వికెట్లు దక్కాయి.ఇషాంత్ శర్మ, షమీ తలో వికెట్ తీసుకున్నారు. భారత్ 292 పరుగుల తొలి ఇన్నింగ్సు ఆధిక్యతను సాధించింది.

భారత్ తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ తడబడుతున్నారు. ఆస్ట్రేలియా 102 పరుగుల స్కోరు వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. మార్ష్ కేవలం 9 పరుగులు చేసి జడేజా బౌలింగులో రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆస్ట్రేలియా  92 పరుగులకు ఐదు వికెట్లో కోల్పోయింది. హెడ్ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా బౌలింగులో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.మార్ష్ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నాలుగో వికెట్ గా వెనుదిరిగాడు.

మూడో రోజు శుక్రవారం 8/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో బ్యాటింగ్‌కి దిగిన పైన్‌సేన ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. 11 ఓవరులో ఇషాంత్‌ వేసిన బంతిని మయాంక్‌ అగర్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఓపెనర్‌ ఫించ్‌ ఔటయ్యాడు. 

14 ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో మరో ఓపెనర్‌ మార్కస్‌ హారిస్‌ అవుటయ్యాడు. 36 పరుగులకే ఆసీస్‌ ఓపెనర్లు పెవిలియన్‌ చేరడంతో పైన్‌ సేన కష్టాల్లో పడింది. ఇక 19వ ఓవర్లో ఉస్మాన్‌ ఖావాజా జడేజా బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు.

click me!