బౌలింగ్ చేస్తే రక్త వాంతులు.. ఆసీస్ బౌలర్‌కు అంతుచిక్కని వ్యాధి

By sivanagaprasad kodatiFirst Published Oct 15, 2018, 9:20 AM IST
Highlights

అంతుచిక్కని జబ్బు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాన్ హేస్టింగ్స్ క్రీడా జీవితాన్ని ప్రమాదంలో పడేసింది. ఊపిరితిత్తుల్లో తలెత్తిన సమస్య వల్ల బౌలింగ్ చేసిన ప్రతిసారీ రక్తపు వాంతులు అవుతుండటంతో ఆయన కెరీర్ డైలమాలో పడింది.

‘‘బౌలింగ్ చేసిన ప్రతిసారీ రక్తపు వాంతి చేసుకుంటున్నా.. కేవలం బౌలింగ్ చేస్తేనే.. పరిగెత్తితే కాదు.. నేను బాక్సింగ్.. రోయింగ్ చేయగలను.. బరువులు ఎత్తగలను.. కానీ కేవలం బౌలింగ్‌కు దిగినప్పుడే ఇలా జరుగుతోంది.

ఊపరితిత్తుల నుంచి రక్తం ఎగజిమ్మి.. దగ్గినప్పుడు అది నోటి ద్వారా బయటకు వస్తోంది. దీని వల్ల ధీర్ఘకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని వైద్యులు చెప్పడం లేదు.. వారి మౌనం నాలో భయాన్ని పెంచుతోంది. ఇకపై నేను బౌలింగ్ చేస్తానో లేదోనని హేస్టింగ్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

click me!