మరో రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ.. గల్లంతైన పాక్ మాజీ కెప్టెన్ రికార్డు

By sivanagaprasad kodatiFirst Published Oct 14, 2018, 5:07 PM IST
Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. అత్యధిక పరుగులు సాధించిన ఆసియా కెప్టెన్‌గా పాక్ మాజీ కెప్టెన్ మిస్బా - ఉల్- హక్ పేరిట ఉన్న రికార్డును విరాట్ బద్ధలు కొట్టాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. అత్యధిక పరుగులు సాధించిన ఆసియా కెప్టెన్‌గా పాక్ మాజీ కెప్టెన్ మిస్బా - ఉల్- హక్ పేరిట ఉన్న రికార్డును విరాట్ బద్ధలు కొట్టాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా కోహ్లీ 45 పరుగులు సాధించి ఈ రికార్డును నెలకొల్పాడు.

మిస్సా 56 మ్యాచ్‌ల్లో 51.39 పరుగుల సగటుతో 4,214 పరుగులు చేశాడు. ఇందులో మిస్బా 8 సెంచరీలు చేశాడు. అయితే కోహ్లీ కేవలం 42 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనతను సాధించాడు. 42 మ్యాచ్‌ల్లో 65.12 సగటుతో 4,233 పరుగులు చేశాడు  కోహ్లీ.

మరోవైపు ఇంకో ప్రతిష్టాత్మక రికార్డుకు కోహ్లీ అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో 24 సెంచరీలు చేసిన కోహ్లీ.. మరో శతకం చేస్తే.. టెస్టుల్లో వేగంగా 25 సెంచరీలు చేసుకున్న రెండో బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధిస్తాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆసిస్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉంది.. ఆయన 68 ఇన్నింగ్సుల్లో 25 సెంచరీలు చేశాడు. 
 

click me!