ఇంగ్లాండ్ అల్ టైమ్ గ్రేట్.. రికార్డులు రారాజు "కుక్"

By sivanagaprasad KodatiFirst Published Sep 3, 2018, 5:28 PM IST
Highlights

రెండు దశాబ్ధాల పాటు ఇంగ్లాండ్ క్రికెట్‌కు ఎనలేని సేవలందించిన కుక్.. తన కెరీర్‌లో ఎన్నో  రికార్డులను బద్ధలు కొట్టి తన పేరును వేసుకున్నాడు. 160 టెస్టుల్లో 12,254 పరుగులు చేశాడు. 

రెండు దశాబ్ధాల పాటు ఇంగ్లాండ్ క్రికెట్‌కు ఎనలేని సేవలందించిన కుక్.. తన కెరీర్‌లో ఎన్నో  రికార్డులను బద్ధలు కొట్టి తన పేరును వేసుకున్నాడు. 160 టెస్టుల్లో 12,254 పరుగులు చేశాడు.

దీనిలో 32 సెంచరీలు, 56 అర్థసెంచరీలు ఉన్నాయి.. అత్యధిక వ్యక్తిగత స్కోరు  294. ఇక 92 వన్డేల్లో 3204 పరుగులు చేశాడు.. ఇందులో 5 సెంచరీలు, 19 అర్థసెంచరీలు ఉన్నాయి. అత్యథిక వ్యక్తిగత స్కోరు 137. ఇక పొట్టి క్రికెట్‌లో 4 మ్యాచ్‌లు ఆడి.. 61 పరుగులు చేశాడు.

*ఇక మార్చి 1, 2006లో టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కుక్.. తన మూడో టెస్టుకు ముందు వరుసుగా రెండు టెస్టు మ్యాచ్‌ల్లో స్థానం కోల్పోగా.. ఆ తర్వాతీ నుంచి నేటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా మిస్ అవ్వలేదు. తద్వారా కెరీర్‌లో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా బ్రేక్ తీసుకోకుండా 154 టెస్టులు ఆడిన ఆటగాడిగా మొదటి స్థానంలో నిలిచాడు. 

* కుక్ తాను ఆడిన ఏడు యాషెస్ సిరీస్‌ల్లో నాలుగు సిరీస్‌లు గెలిచిన జట్టులో ఉన్నాడు.
* 2012లో ఆండ్రూ స్టాస్ నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన కుక్.. 24 టెస్టుల్లో జట్టుకు కెప్టెన్ వ్యవహరించి 24 ఏళ్ల తర్వాత యాషెస్ సిరీస్‌లో ఆసీస్‌ను ఓడించి సిరీస్‌                అందించాడు. 
* కెప్టెన్‌గా రెండు యాషెస్ సిరీస్‌లను అందుకున్నాడు.
* 10,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఇంగ్లాండ్ ఆటగాడు.
* తన సహచరుడు స్ట్రాస్‌తో కలిసి 177 ఇన్నింగ్స్‌ల్లో 4,711 పరుగులు సాధించి.. 2006 నుంచి 2012 మధ్య ప్రపంచంలోని అత్యుత్తమ ఓపెనింగ్ జోడీగా రికార్డుల్లోకి ఎక్కాడు.
* మొత్తం క్రీడా జీవితంలో 610 గంటల పాటు బ్యాటింగ్ చేశాడు.

ఇండియాతోనే చివరిగా: అప్పుడు కెప్టెన్‌గా.. ఇప్పుడు ఆటగాడిగా

56 ఏళ్ల వయసులో.. 36 ఏళ్ల అమ్మాయితో టీమిండియా కోచ్ రవిశాస్త్రి ప్రేమాయణం..?

అంతర్జాతీయ క్రికెట్‌కు కుక్ వీడ్కోలు

click me!