మళ్లీ 6 బంతుల్లో 6 సిక్సులు.. యువరాజ్‌ కంటే ఒక పరుగు ఎక్కువే

By sivanagaprasad kodatiFirst Published Oct 15, 2018, 11:22 AM IST
Highlights

ఆఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) టీ20 క్రికెట్ టోర్నమెంటులో అద్భుతం ఆవిష్కృతమైంది. యువ బ్యాట్స్‌మెన్ హజ్రతుల్లా బజాయ్ ఒకే ఓవర్లో 6 సిక్సులు కొట్టడంతో పాటు మొత్తం 37 పరుగులు సాధించాడు.

ఆఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) టీ20 క్రికెట్ టోర్నమెంటులో అద్భుతం ఆవిష్కృతమైంది. యువ బ్యాట్స్‌మెన్ హజ్రతుల్లా బజాయ్ ఒకే ఓవర్లో 6 సిక్సులు కొట్టడంతో పాటు మొత్తం 37 పరుగులు సాధించాడు.

బల్ఖ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కాబూల్ జ్వనాన్ బ్యాట్స్‌మెన్ హజ్రతుల్లా జజాయ్.. మజారి బౌలింగ్‌లో వరుస బంతుల్లో (6, 6, వైడ్, 6, 6, 6, 6) కొట్టి మొత్తం 37 పరుగులు సాధించాడు. ఇదే జోరులో 12 బంతుల్లోనే సెంచరీ చేసి ఫాస్టెస్ట్ ఫిఫ్టీని కూడా కొట్టాడు.

ఈ క్రమంలో అతను యువరాజ్ సింగ్, క్రిస్‌గేల్‌ల సరసన నిలిచాడు. సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్, రవిశాస్త్రి, యువరాజ్ సింగ్ మాత్రమే ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన ఘనత సాధించారు.

మొత్తంగా ఈ మ్యాచ్‌లో హజ్రతుల్లా 17 బంతుల్లో 62 పరుగులు సాధించి జట్టు భారీ స్కోరు సాధించడంలో సాయపడ్డాడు. అయినప్పటికీ ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.. 244 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన కాబూల్ జ్వనాన్ బ్యాట్స్‌మెన్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 223 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అంతకు ముందు  క్రిస్‌గేల్ వీర విహారం చేయడంతో బల్ఖ్ లెజెండ్స్ 244 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇదే మ్యాచ్‌లో బల్ఖ్ లెజెండ్స్ బ్యాట్స్‌మెన్ 23 సిక్సర్లు కొట్టడంతో ఒక టీ20 ఇన్నింగ్సులో అత్యధిక సిక్సకర్లు కొట్టిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు 21 సిక్సర్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వెస్టిండీస్, రంగ్‌పూర్ రైడర్స్, భారత్ పేరిట ఉన్న రికార్డును బల్ఖ్ లెజెండ్స్ తిరగరాసింది.

click me!