Vastu Tips: గుడి పక్కన ఇల్లు కట్టుకోవచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

Published : Apr 07, 2026, 02:28 PM IST
Vastu Tips

సారాంశం

గుడి పక్కన ఇల్లు కట్టుకోవడం చాలా మందికి శుభప్రదంగా అనిపిస్తుంది. దానివల్ల ఆధ్యాత్మిక శాంతి, సానుకూల వాతావరణం ఉంటాయని నమ్మకం. కానీ వాస్తు ప్రకారం గుడికి దగ్గరగా లేదా ఎదురుగా ఇల్లు కట్టుకోవచ్చా? గుడి నీడ ఇంటిపై పడితే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

Vastu Tips: సాధారణంగా గుడికి దగ్గరలో ఇల్లు ఉండటం మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. గుడి నీడ కూడా మన ఇంటి మీద పడటం మంచిది కాదంటారు. కానీ కొన్ని జాగ్రత్తలతో దేవాలయం దగ్గరలో ఇల్లు కట్టుకోవచ్చట. అవేంటో చూద్దాం.

దేవాలయం పవిత్ర స్థలం అయినప్పటికీ… దాని స్థానం, దిశ, దూరం వంటి అంశాలు ఇంటి వాస్తుపై ప్రభావం చూపుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు ప్రకారం, ఒక ఇల్లు శివాలయానికి కనీసం 750 మీటర్ల దూరంలో ఉండాలి. అదే ఇతర ఆలయాలకైతే, కనీసం 30 అడుగుల దూరం పాటించాలి. ఏ గుడి అయినా సరే, దాని నీడ ఇంటిపై పడకూడదని, ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా గుడి ఉండకూడదని వాస్తు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు

వాస్తు నిపుణుల ప్రకారం.. ఆలయానికి, ఇంటికి మధ్య కనీసం 30 అడుగుల దూరం ఉండాలి. ఒకవేళ ఇల్లు గుడి ప్రాంగణానికి దగ్గరగా లేదా ఆనుకొని ఉంటే, ఆ ఇంట్లో నివసించే వారికి ఎలాంటి అభివృద్ధి ఉండదు. ఆ ఇంటిని చూసినప్పుడల్లా ఏదో తెలియని విషాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఆ ఇల్లు కళావిహీనంగా ఉంటుంది. గుడి నీడ ఇంటిపై పడితే, ఆ ఇంట్లో వరుస వైఫల్యాలు, అనారోగ్యాలు, దురదృష్టాలు వెంటాడుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా గుడి లేదా ధ్వజస్తంభం ఉంటే సంతాన నష్టం, సంతానలేమి, పేదరికం, అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. డబ్బు విపరీతంగా ఖర్చైపోతుంది. అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయం, ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటాయని వాస్తు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం, గుడి గోపురం నీడ, ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత పడే నీడ ఇంటిపై పడకూడదు. ఇది ఇంట్లో వాళ్ల మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. శివాలయం ద్వారానికి సరిగ్గా ఎదురుగా లేదా శివుడి దృష్టి నేరుగా పడే చోట ఇల్లు అస్సలు ఉండకూడదు. పరమేశ్వరుడి చూపు చాలా శక్తివంతమైనది. ఆ ఉగ్రతను సాధారణ మనుషులు తట్టుకోలేరని పండితులు చెబుతున్నారు. గుడి గోపురం కంటే ఇల్లు ఎత్తుగా ఉండకూడదు. ఇది దైవ నిందగా భావిస్తారు. దేవుడి నివాసమే ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలన్నది నియమం. గుడి ప్రహరీ గోడకు, ఇంటి గోడకు మధ్య కనీసం 100 నుంచి 200 అడుగుల దూరం ఉండటం చాలా మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Significance of Temple Bells: గుడిలో గంట ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న క్రేజీ సైన్స్ ఏంటో తెలుసా?
10 Largest Hindu Temples: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుంది? టాప్ 10 భారీ ఆలయాలు ఇవే