Hanuman Mantras: హనుమాన్ పవర్ ఫుల్ మంత్రాలు.. వీటిని పఠిస్తే అన్నీ శుభాలే!

Published : Mar 31, 2026, 06:02 PM IST
Hanuman Mantras

సారాంశం

హనుమాన్.. భక్తి, బలం, ధైర్యానికి ప్రతీక. హిందూ ధర్మ గ్రంథాల్లో హనుమంతుడికి సంబంధించిన ఎన్నో మంత్రాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా శక్తివంతమైనవి. వాటిని జపిస్తే ఎంత పెద్ద కష్టాల నుంచైనా గట్టెక్కవచ్చని పండితులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

Hanuman Mantras In Telugu: సాధారణంగా ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈసారి ఈ పండుగ ఏప్రిల్ 2న వచ్చింది. ఈ రోజున హనుమంతుడిని పూజించడం, కొన్ని పరిహారాలు చేయడం వల్ల మంచి జరుగుతుందని నమ్మకం. ముఖ్యంగా హనుమాన్ జయంతి నాడు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను జపిస్తే ఎంత పెద్ద కష్టాన్ని అయినా దాటవచ్చని పండితులు చెబుతున్నారు. మరి అత్యంత శక్తివంతమైన హనుమంతుడి మంత్రాలు, వాటిని జపించే పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శక్తివంతమైన హనుమాన్ మంత్రాలు

1. ఓం శ్రీ హనుమతే నమః
2. ఓం ఐం భ్రీం హనుమతే శ్రీ రామ దూతాయ నమః
3. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి। తన్నో హనుమత్ ప్రచోదయాత్
4. ఓం శ్రీ వజ్రదేహాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమోస్తుతే
5. ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్
6. ఓం నమో భగవతే పంచవదనాయ ఆగ్నేయాయ హనుమతే నమః
7. ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రుసంహారణాయ।
సర్వరోగ హరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహా
8. ఓం అంజనీసుతాయ అంగదాది సమేతాయ నమః
9. ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహా
10. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్।
వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే

హనుమాన్ మంత్రాలను ఎలా జపించాలి?

- పండితుల ప్రకారం.. హనుమాన్ జయంతి నాడు, అంటే ఏప్రిల్ 2న ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి.
- ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో గంగా జలం చల్లి ఆ స్థలాన్ని పవిత్రం చేయాలి. అక్కడ ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేయాలి.
- ఆ పీఠంపై హనుమంతుడి ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టాలి. ముందుగా హనుమంతుడికి తిలకం దిద్దాలి.
- తర్వాత స్వామివారి చిత్రపటానికి లేదా విగ్రహానికి పూలమాల వేసి, ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి.
- పూజ పూర్తయ్యాక, రుద్రాక్ష మాలతో పైన చెప్పిన మంత్రాలలో ఏదైనా ఒకదాన్ని మీ కోరిక మేరకు జపించాలి.
- హనుమంతుడి ఏ మంత్రాన్ని అయినా కనీసం 5 మాలలు జపించాలి. (ఒక మాల అంటే 108 సార్లు)
- మంత్ర జపం పూర్తయ్యాక, మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే దాన్ని హనుమంతుడి ముందు చెప్పుకోవచ్చు.
- ఈ విధంగా మంత్ర జపం చేయడం వల్ల మీపై హనుమంతుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని పండితులు చెబుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tulsi Plant: తులసి మొక్కకి ఇవి సమర్పిస్తే.. మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు.!
Sriramanavami Special: శ్రీరామనవమి రోజు చేసే స్పెషల్ ప్రసాదాల గురించి తెలుసా?