ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా... ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు!

Published : Mar 01, 2023, 03:15 PM IST
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా... ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు!

సారాంశం

సాధారణంగా ప్రతి ఒక్కరూ రోజులో ఎంతో కష్టపడి పని చేస్తూ ఉన్నప్పటికీ చేతికి డబ్బు అందిన ఆ డబ్బు మాత్రం చేతిలో నిలబడదు. ఇలా వచ్చిన డబ్బు వచ్చిన విధంగానే ఖర్చవుతుంది. ఇలా చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఇలా ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు ఇంట్లో ఈ రెండు వస్తువులను పెట్టి పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులకు చెక్ పెట్టవచ్చు.  

ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ఇంట్లో పూజ గదిలో కామదేనువు విగ్రహాన్ని అలాగే నెమలి పించాన్ని పెట్టడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.కామదేనువు నెమలి పించం ఈ రెండు కూడా శ్రీకృష్ణుడిని చూచిస్తాయి కనుక వీటిని ఇంట్లో పెట్టి పూజ చేయడం వల్ల మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనపై ఉంటుంది.

అయితే నెమలి పించాన్ని ఆగ్నేయ దిశలో పెట్టి పూజించడం మంచిది అయితే దీనిని ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేయకూడదు ఏదైనా పండుగ సందర్భాలలోనూ లేదా పౌర్ణమి వంటి ముఖ్యమైన రోజున నెమలి పించాన్ని కొనుగోలు చేసి ఇంట్లో ఆగ్నేయ దిశ వైపు పెట్టి పూజ చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఆవుకు దూడపాలు తాగుతున్నటువంటి కామదేనువు విగ్రహాన్ని కూడా ఇంట్లో పెట్టి పూజించడం ఎంతో మంచిది. 

ఈ విగ్రహాన్ని ఉత్తరం లేదా తూర్పు దిశ వైపు పెట్టి పూజ చేయాలి.ఇలా కామదేనువు విగ్రహం ఇంట్లో ఉండటం వల్ల ఆ ఇంట్లో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని, సంతానం లేని దంపతులకు సంతానయోగం కూడా కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంట్లో ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వారు వీటిని ఇంట్లో పెట్టి పూజించడం ఎంతో మంచిది. అదే ఉద్యోగాలలోను వ్యాపారాలలోనూ ఇబ్బందులతో సతమతమయ్యేవారు వ్యాపారం చేసే చోట వారి ఆఫీసులలోనూ ఈ విగ్రహాలను పెట్టుకోవడం వల్ల శుభం కలుగుతుంది.

PREV
click me!

Recommended Stories

Chanakya Niti: పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారా.? ఇలాంటి మ‌హిళ‌ల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది
చాణక్య నీతి ప్రకారం ఇలాంటి జీవిత భాగస్వామి ఉంటే జీవితాంతం కష్టాలే!