Mahashivratri 2023: నేడే మహాశివరాత్రి. ఈ పవిత్రమైన రోజునే పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరిగిందని నమ్ముతారు. కాగా ప్రతి ఏడాది ఫాల్గున మాసం కృష్ణ పక్షం చతుర్ధశి రోజున వచ్చే మహాశివరాత్రి ఎంతో పవిత్రమైనది. ఈ రోజున శివ భక్తులు కొన్ని పనులను అస్సలు చేయకూడదని జ్యోతిష్యలు చెబుతున్నారు. అవేంటంటే..
Mahashivratri 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏడాది ఫాల్గున మాసంలోని కృష్ణ పక్షం చతుర్ధశి రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం. ఈ పవిత్రమైన రోజున శివారాధన చేస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రోజున శివభక్తులలంతా ఉపవాసం ఉండి.. శివుడిని పూజిస్తారు. తెల్లవార్లూ జాగారం ఉండి పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకుంటారు. అయితే ఈ రోజు ఉపవాసం ఉండే వారు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాల్సి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నలుపు దుస్తులను ధరించకూడదు
undefined
మహాశివరాత్రి నాడు ఉదయాన్నే స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాతే శివుడికి పూజ చేయాలి. స్నానం చేయకుండా ఏదీ తినకూకడదు. ఉపవాసం ఉన్నవారే కాదు లేని వారు కూడా స్నానం చేయకుండా ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ముఖ్యంగా మహాశివరాత్రి నాడు నల్ల రంగు బట్టలను అసలే వేసుకోకూడదు. ఎందుకంటే నలుపు రంగు దుస్తులను అశుభంగా భావిస్తారు. అలాగే శివలింగానికి సమర్పించిన ప్రసాదాలను స్వీకరించకూడదు. దీనివల్ల దురదృష్టం మీ వెంటే ఉంటుంది. ముఖ్యంగా డబ్బు నష్టపోయే అవకాశం కూడా ఉంది.
వీటిని తినకూడదు
మహాశివరాత్రి నాడు గోధుమలు, పప్పులు, బియ్యంతో చేసిన ఆహారాలు అసలే తినకూడదు. ఉపవాసం ఉండేవారు పండ్లు, పాలు మాత్రమే తీసుకోవాలి. ఇకపోతే సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి ఆహారాలను తినకూకడదు. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. కొత్తవి లేదా శుభ్రంగా ఉన్న బట్టలను వేసుకోండి. ఉపవాసం ఉండేవారు శివారాధన చేయాలి.
రాత్రిపూట నిద్రపోకండి
శివరాత్రి రోజున జాగారం ఖచ్చితంగా చేయాలి. అలా కాకుండా తెల్లవార్లు నిద్రపోతే ఉపవాస ఫలితాన్ని పొందలేరు. అందుకే ఈ రోజు రాత్రి జాగారాన్ని చేయండి. మరుసటి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత శివుడికి పూజ చేసి ప్రసాదం తీసుకుని ఉపవాసాన్ని విరమించొచ్చు.
శివలింగానికి కుంకుమను సమర్పించకూడదు
శివలింగానికి కుంకుమను ఎట్టి పరిస్థితిలో సమర్పించకూడదు. మహాశివరాత్రి రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి గంధాన్ని సమర్పించండి. అయితే వినాయకుడికి, పార్వతీ దేవికి కుంకుమను సమర్పించొచ్చు.
చిరిగిపోయిన బిల్వ పత్రాలు
పరమేశ్వరుడికి బిల్వ పత్రాలు అంటే ఎంతో ఇష్టమట. అందుకే మహాశివరాత్రి నాడు శివలింగానికి ఖచ్చితంగా బిల్వపత్రాలను సమర్పిస్తారు. ఈ పత్రాలపై ఓం నమ: శివాయ అని రాసి శివుడికి సమర్పిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. అయితే శివుడికి ఆకులను సమర్పించే ముందు అవి ఎలా ఉన్నాయో చూడండి. చిరిగిపోయిన ఆకులను ఎట్టి పరిస్థితిలో సమర్పించకూడదు.