మహా శివరాత్రి నాడు ఉపవాసం ఉండేవాళ్లు ఈ తప్పులను అస్సలు చేయకండి

By Mahesh Rajamoni  |  First Published Feb 16, 2023, 3:37 PM IST

Mahashivratri 2023: శివరాత్రి నాడు ఉపవాసం ఉండే వారు శివుడి అనుగ్రహం పొందుతారని నమ్ముతారు. అయితే ఈ ఉపవాసంలో కొన్ని తప్పులను చేస్తే మాత్రం ఎలాంటి ఫలితం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 


Mahashivratri 2023: ఈ ఏడాది ఫిబ్రవరి 18 న మహాశివరాత్రి వచ్చింది. శివరాత్రి ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నిష్టగా ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుడిని పూజిస్తే మనం చేసిన పాపాలన్నీ పోయి.. మన  ఇళ్లు సుఖ శాంతులతో వర్దిల్లుతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు. అయితే ఈ ఉపవాసం ఉండే వారు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. ఉపవాసం ఉండే వారు ఎలాంటి తప్పులు చేయకూడదంటే? 

తప్పుడు ఆహారంలో ఉపవాసాన్ని విడవడం

Latest Videos

undefined

శివరాత్రి రోజున ఉపవాసం ఉండే వారు కొన్ని రకాల ఆహారాలతోనే ఉపవాస దీక్షను విరమించాల్సి ఉంటుంది. పండ్లు, పాలతో కూడిన భోజనంతోనే ఉపవాసాన్ని విరమించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీటికి బదులుగా మాంసాహారం, ఆల్కహాల్ లేదా తినకూడదని ఇతర పదార్థాలతో ఉపవాసాన్ని విరమిస్తే శివుడి అనుగ్రహం లభించదు. అతేకాదు మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. 

వ్యక్తిగల పరిశుభ్రతను పాటించకపోవడం

హిందూ మతంలో పరిశుభ్రత చాలా కీలకమైన అంశం. అందులోనూ శివరాత్రి నాడు శుచి శుభ్రతను ఖచ్చితంగా పాటించాలి. అయితే కొంతమంది ఉపవాసం ఉండేవారు ఎప్పుడో ఉపవాసం విడిచే ముందే బ్రష్, స్నానం చేస్తుంటారు. కానీ ఇలా పరిశుభ్రత లేకుండా అస్సలు ఉండకూడదు. దీనివల్ల మీపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. 

తగిన ప్రార్థనలు చేయకపోవడం

శివరాత్రి అంటే శివుడికి అంకితం చేయబడిన రోజని అర్థం. ఈ రోజున శివుడికి సంబంధించిన ప్రార్థనలు, మంత్రాలను మాత్రమే పఠించాలి. అంతేకానీ వేరే మంత్రాను పఠించకూడదు. దీనివల్ల మీరు పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందలేరు. 

ప్రతికూల ఆలోచనలు

శివరాత్రి ఉపవాసం ఉండేవారికి సానుకూల ఆలోచనలు మాత్రమే రావాలి. అంతేకానీ కోసం, అసూయ, దురాశ వంటి ప్రతికూల ఆలోచనలు రాకూడదు. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రతికూల ఆలోచనలు దైవభక్తికి ఆటంకం కలిగిస్తాయి. 

ముందుగానే ఉపవాస దీక్షను విరమించడం

హిందూ గ్రంధాలు సూచించిన విధంగానే ఉపవాసం ఉండాలి. ఆరోగ్యం బాగా లేకపోవడం లేదా ఇతర సరైన కారణం ఉంటేనే ఉపవాసాన్ని ముందుగా విరమించాలి. ఆకలి తట్టుకోలేక లేదా ఇరత కారణాలతో ముందుగానే ఉపవాస దీక్షను విరమించడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల ఉపవాస ఫలితాలు తగ్గుతాయి. అలాగే శారీరక సమస్యలు కూడా వస్తాయి. 

ఉపవాస నియమాలను పాటించకపోవడం

శివరాత్రి నాడు ఎప్పుడు ఉపవాసం ఉండాలి? తీసుకోవాల్సిన ఆహారం, ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి వంటి పద్దతులను పక్కాగా పాటించాలి. అప్పుడే మీరు భోళాశంకరుడి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ పద్దతులను, నియమాలను పాటించకపోవడం వల్ల ఉపవాస ఫలితాలను పొందలేరు.  

click me!