Kashi Vishwanath Temple కాశీలో చెప్పుల కుప్పలు! వామ్మో.. రోజుకి 2 లారీలా?

కాశీలోని గంగలో మునిగితే సర్వం పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అక్కడ మనకిష్టమైన వస్తువులు వదిలేయడం ఒక సంప్రదాయంగా వస్తోంది. అయితే వీటికి భిన్నంగా, చిత్రంగా జనం తమ పాదరక్షలను అక్కడ విడిచిపెడుతున్నారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ మందిరం దగ్గర భక్తులు వదిలేసిన చెప్పులు పెద్ద సమస్యగా మారాయి. రోజుకి 2 లారీల చెప్పులు చెత్త కుప్పలో పడేస్తున్నారు.

Kashi vishwanath temple shoe pileup like ayodhya devotee footwear issues in telugu

2 లోడ్ల చెప్పులు: అయోధ్యలో భక్తులు వదిలేసిన చెప్పులు పెద్ద సమస్యగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పడు భక్తులతో కిటకిటలాడుతున్న వారణాసి (కాశీ)లో కూడా అదే సమస్య ఎదురవుతోంది. ప్రతిరోజు కాశీ విశ్వనాథ మందిరం చుట్టుపక్కల నుంచి 2 లారీల లోడ్ల చెప్పులు చెత్త కుప్పలో పడేస్తున్నారు. కుంభమేళా మొదలైన తర్వాత ప్రయాగ్‌రాజ్ నుంచి భక్తులు అయోధ్య, వారణాసికి రావడం ఎక్కువైంది. కానీ కాశీ గుడికి వెళ్ళే దారులు అంత వెడల్పుగా లేకపోవడంతో గుడి ప్రవేశ ద్వారం దగ్గర, రోడ్ల మీద చెప్పులు వదిలేసి భక్తులు దేవుడి దర్శనానికి వెళ్తున్నారు. అయితే ప్రతిరోజు లక్షల మంది రావడంతో, భక్తులు దేవుడి దర్శనం చేసుకొని బయటికి వచ్చేటప్పుడు వాళ్ళ చెప్పులు ఎక్కడెక్కడో పడిపోయి ఇబ్బందిగా మారుతోంది. కొన్నిసార్లు ఎక్కడ విడిచామో తెలియక భక్తులు చెప్పులు అక్కడే వదిలేస్తున్నారు. కొందరు కావాలని చేస్తున్నారు. దీంతో గుడి చుట్టుపక్కల ప్రతిరోజు చాలా చెప్పులు మిగిలిపోతున్నాయి. అందుకే పాలిక సిబ్బంది అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు వచ్చి మిగిలిన చెప్పులు పోగు చేసి చెత్త కుప్పలో వేస్తున్నారు. ఇలా ప్రతిరోజు 2 లారీల లోడ్ల చెప్పులు పోగవుతున్నాయని పాలిక సిబ్బంది చెప్పారు.

click me!