మీరు కూడా మీకు తెలిసిన వారికి అప్పు ఇచ్చి.. వాటిని తిరిగి ఎలా రాబట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా..? అయితే.. ఈ గుడికి వెళ్లాల్సిందే. ఈ గుడి పేరు రక్త చాముండి ఆలయం.
స్నేహితులు, బంధువులకు మనం అప్పు ఇవ్వడం చాలా సర్వ సాధారణం. అయితే.. ఆ తీసుకున్న అప్పును కొందరు వెంటనే తిరిగి ఇచ్చేస్తారు. కానీ.. కొందరు మాత్రం అస్సలు తిరిగి ఇవ్వరు. మన దగ్గర తీసుకున్న డబ్బు మనకు ఇవ్వకపోగా.. రివర్స్ లో మనల్ని బెదిరించడం లేదంటే.. అప్పుడిస్తా ఇప్పుడిస్తా అని కబుర్లు చెప్పడం.. ఇంకా లేదంటే... తప్పించుకు తిరగడం లాంటివి చేస్తూ ఉంటారు. మీరు కూడా మీకు తెలిసిన వారికి అప్పు ఇచ్చి.. వాటిని తిరిగి ఎలా రాబట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా..? అయితే.. ఈ గుడికి వెళ్లాల్సిందే. ఈ గుడి పేరు రక్త చాముండి ఆలయం.
గుడి ఎక్కడ ఉంది?
ఈ ఆలయం షిమోగా జిల్లాలోని తీర్థహళ్లి తాలూకాలోని శరావతి నదికి మూలమైన అంబుతీర్థలో ఉంది. చాలా కాలం క్రితం తల్లి తన రక్తాన్ని త్యాగం చేస్తున్నందున ఆమెకు రక్త చాముండి అని పేరు పెట్టారు.
undefined
ఈ గుడికీ.. .. మనం ఎవరికో ఇచ్చిన అప్పుకీ ఏంటి సంబంధం అనే అనుమానం మీకు రావచ్చు. ఈ గుడి స్పెషాలిటీనే అది. ఆ గుడికి వెళ్లి.. మనం ఎవరికి అప్పు ఇచ్చామో.. వాళ్లు తిరిగి ఇవ్వకుండా మీకు అన్యాయం చేశారో అక్కడ చెప్పాల్సి ఉంటుంది. మనం వెళ్లి చెప్పిన వెంటనే.. వారు మనం డబ్బు ఇవ్వాల్సిన వారికి నోటీసులు పంపుతారు. మొదటి నోటీసుకే చాలా మంది డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు. అలా ఇ్వకుంటే మరో రెండు నోటీసులు వెళతాయి. అయినా స్పందనలేకపోతే.. వారు తీవ్ర కష్టాలు పడతారట. సంవత్సరం తిరిగేలోగా.. నిందితుడిని చాముండి చాలా కష్టాలు పడేలా చేస్తోంది. ప్రమాదాలు, అనారోగ్యం, గృహోపకరణాలు కోల్పోవడం, కుటుంబంలో కలహాలు మొదలైనవి. చాలా మంది ప్రమాదం జరగకముందే భయపడిపోయి.. డబ్బులు తిరిగి ఇచ్చేస్తూ ఉంటారట.
కేవలం రుణ చెల్లింపు మాత్రమే కాదు. సంతానం లేనివారు.. ఈ అమ్మవారి వద్దకు వచ్చి మొక్కుకుంటే.. వెంటనే సంతానం కలుగుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత మళ్లీ వచ్చి.. అమ్మవారికి చీర, పసుపు, కుంకుమలు సమర్పించాలి.
ఈ చాముండీ ఆలయం సమీపంలోని గ్రామాల్లో దొంగతనాలు కూడా జరగవట. ఒకవేళ ఎవరైనా చోరీ చేసినా.. ఆ సొత్తును.. గుడికి ఇవ్వడం కానీ.. లేదంటే.. ఏ ఇంట్లో చోరీ చేశారో.. ఆ ఇంట్లోనే తిరిగి ఇచ్చేస్తారట. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ఆ చాముండీ దేవి తన రక్తంతో కాపాల కాస్తుందని అక్కడివారి నమ్మకం.
ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజున ఇక్కడ ప్రత్యేకంగా ప్రశ్నావళి కార్యక్రమం జరుగుతుంది. అంటే.... ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే.. అక్కడకు వచ్చి వారిని అడిగితే సమాధానం చెబుతారు. అంటే... ఇంట్లో ఏదైనా పోయినా.. ఎవరికైనా ఏదైనా జరిగితే.. ఆ ఏం జరిగిందని అడిగితే.. అమ్మవారు సమాధానం ఇస్తారని అక్కడివారు నమ్ముతుంటారు.