Akshaya Tritiya 2026:అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేరా? డోన్ట్ వర్రీ.. ఇవి కొన్నా అదృష్టమే!

Published : Apr 09, 2026, 12:19 PM IST
Akshaya Tritiya 2026

సారాంశం

అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలని చాలామంది అనుకుంటారు. కానీ బంగారం కొనే స్థోమత లేనివాళ్ల పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారా? అయితే ఈ శుభవార్త మీకోసమే. అక్షయ తృతీయ నాడు బంగారమే కొనాల్సిన పనిలేదు. బదులుగా ఇవి కొన్నా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది.

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ అనగానే అందరికీ గుర్తొచ్చేది బంగారం కొనడమే. ఆ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి ఆశీస్సులు దక్కుతాయని చాలామంది నమ్ముతారు. జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయని కూడా భావిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి వంటివి కొంటుంటారు. కానీ, ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి కొనడం అందరికీ సాధ్యం కాదు. అలాంటప్పుడు, తక్కువ ఖర్చుతో కొన్ని వస్తువులు కొని కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. ఇవి చవకైనవే అయినా, అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా లభిస్తాయిని చెబుతున్నారు పండితులు. మరి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి కటాక్షం కోసం, సిరిసంపదలు పెంచుకోవడం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అక్షయ తృతీయ నాడు బంగారు బదులు కొనాల్సిన వస్తువులు

పసుపు

పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున పసుపు కొనడం శుభ ఫలితాలనిస్తుంది. పసుపు, కుంకుమను లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టి పూజించాలి. ఆ తర్వాత వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి, డబ్బులు దాచుకునే చోట పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమై, సంతోషంగా ఉంటారు. లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

మట్టికుండ

పండితుల ప్రకారం అక్షయ తృతీయ రోజున మట్టి కుండ కొనడం చాలా శుభప్రదం. కొత్త కుండ కొని, అందులో నీళ్లు నింపడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది. జీవితంలో విజయం సాధిస్తారు. మీ కెరీర్‌లో కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి.

బియ్యం

అక్షయ తృతీయ రోజున బియ్యాన్ని ఇంటికి తీసుకురావడం శుభ ఫలితాలనిస్తుంది. బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా, సిరిసంపదలకు చిహ్నంగా పూజిస్తారు. అలాంటి బియ్యాన్ని ఆ రోజు ఇంటికి తెచ్చుకుంటే అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

తులసి మొక్క

మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే, అక్షయ తృతీయ రోజున తప్పకుండా తీసుకురండి. తులసి మొక్కను సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇది స్వచ్ఛతను, ఆరోగ్యాన్ని ఇస్తుంది. సంపదను పెంచుతుంది. రోజూ తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే, లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ మీపై ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.

కల్ల ఉప్పు

చాలామంది కల్ల ఉప్పును పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని తొలగించి, పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది. దీన్ని ఇంటికి తీసుకురావడం వల్ల ఇంట్లో శక్తులు సమతుల్యంగా ఉంటాయి, సంతోషం పెరుగుతుంది. 

పుస్తకాలు

పండితుల ప్రకారం పుస్తకాలను సరస్వతీ దేవి స్వరూపంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజు మీకు అవసరమైన పుస్తకాలు కొనడం చాలా శుభప్రదం. జ్ఞానంతో పాటు సంపద కూడా పెరుగుతుంది. అలాగే, ధన త్రయోదశి రోజున చీపురు కొన్నట్లే, అక్షయ తృతీయ రోజున కూడా చీపురు కొనడం శుభ ఫలితాలనిస్తుంది. లక్ష్మీదేవి కృపతో సంతోషంగా ఉంటారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vastu Tips: గుడి పక్కన ఇల్లు కట్టుకోవచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Chanakya Niti: కోట్లు సంపాదించడం కాదు.. ఈ అలవాట్లు ఉంటేనే డబ్బు నిలుస్తుంది..!