ప్రేమలో ఉన్నవారు సాధ్యమైనంత వరకు తమ లవర్ తో సమయం గడపాలని ఆరాటపడుతూ ఉంటారు.
సంతోషంలో ఉన్నవారినీ, బాధలో ఉన్నవారినీ మనం గుర్తించేలేమేమో కానీ... ప్రేమలో పడిన వారిని మాత్రం సులభంగా గుర్తించవచ్చని నిపుణుులు చెబుతున్నారు. ప్రేమలో పడినవారు కొన్ని రకాలుగా ప్రవర్తిస్తారట. దాని ద్వారా వారు ప్రేమలో పడినట్లు గుర్తించవచ్చట. అదెలాగో ఓసారి చూద్దాం..
1.ప్రేమలో పడినవారు ప్రతి నిమిషం తమ లవర్ గురించే ఆలోచిస్తూ ఉంటారు. రోజంతా వారు పక్కన లేకపోయినా వారి గురించే ఆలోచిస్తారు. వారి ధ్యాసలోనే బతికేస్తూ ఉంటారు.
undefined
2.ప్రేమలో ఉన్నవారు సాధ్యమైనంత వరకు తమ లవర్ తో సమయం గడపాలని ఆరాటపడుతూ ఉంటారు. డేట్ కి వెళ్లాలనో, డిన్నర్ కి వెళ్లాలనో లేదంటే... ఏదో ఒక విధంగా సమయం గడుపుదామా అని చూస్తూ ఉంటారు.
3.ప్రేమలో ఉన్నవారు వారి ప్రయారిటీస్ మార్చుకుంటారు. తమ పార్ట్ నర్ కి ఏం కావాలి..? వారి అసవరాలు ఏంటి..? వారిని ప్రతి విషయంలోనూ సంతోషంగా, కంఫర్ట్ గా ఉంచడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు.
4.పీకల్లోతు ప్రేమలో ఉన్నవారు.. తమ లవర్ తో ఎమోషనల్ గా ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉంటారు.
5.నిజమైన ప్రేమలో ఉన్నవారు... తమ భాగస్వామిని నిత్యం సంతోషంగా ఉంచాలని చూస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాల్లోనూ బాధ పెట్టాలని అనుకోరు.
6.పీకల్లోతూ ప్రేమలో ఉన్నవారు.. తమ లవర్ దగ్గర ఎమోషన్స్ విషయంలో ఎలాంటి ఆటలాడరు. నిజాయితీగా ఉంటారు. వారికి ఎలాంటి హాని కలిగించాలని అనుకోరు.
7.నిజంగా ప్రేమించిన వారు తమ భాగస్వామి కలలను నిజం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. వారి లక్ష్యాలు చేరుకోవడానికి సహాయం చేస్తారు. అన్ని విషయాల్లోనూ అండగా ఉంటారు.