మీ ముందు వారి ఫీలింగ్స్ వ్యక్తపరచడం లేదు అంటే...వారు మీ ముందు నటిస్తున్నారని అర్థం. వారికి మీతో రిలేషన్ షిప్ పెద్దగా ఆసక్తి లేదని అర్థం.
ప్రేమను అందరూ కోరుకుంటారు. అయితే... అది నిజమైన ప్రేమ అయ్యి ఉండాలి. నిజమైన ప్రేమ అందంగా, ఆత్మీయంగా ఉంటుంది. అలా కాకుండా... వారు నిజంగా ప్రేమించకుండా.. కేవలం నటిస్తూ ఉంటే ఎలా ఉంటుంది. ఆ ప్రేమ మొదట్లో బాగానే ఉంటుంది. కానీ తర్వాతర్వాత భారంగా మారుతుంది. ఎందుకంటే జీవితాంతం నటించడం ఎవరి వల్లా కాదు. అయితే... మనల్ని ప్రేమించే వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నారా లేక..నటిస్తున్నారా అని తెలుసుకోవడమెలా..? ఇదిగో ఈ కింది పాయింట్స్ చదవితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది.
నిజంగా ప్రేమించిన వారు మాత్రమే వారి భావాలను మీకు తెలియజేస్తారు. అలా కాకుండా... మీ ముందు వారి ఫీలింగ్స్ వ్యక్తపరచడం లేదు అంటే...వారు మీ ముందు నటిస్తున్నారని అర్థం. వారికి మీతో రిలేషన్ షిప్ పెద్దగా ఆసక్తి లేదని అర్థం.
నిజమైన ప్రేమలో ఉన్నవారు... తాము ప్రేమించేవారి సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. వారితో రొమాన్స్, శృంగారాన్ని ఇష్టపడతారు. కానీ అలా కాకుండా.... ఆ విషయంలో ప్రతిసారీ మిమ్మల్ని దూరం పెడుతున్నారు అంటే కాస్త ఆలోచించాల్సిందే.
నిజమైన ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామికి తరచూ అబద్ధాలు చెప్పరు. కానీ.. ఒక వ్యక్తి తరచూ అవసరం ఉన్నా లేకున్నా.. అబద్ధాలు చెబుతున్నారంటే... వారు మిమ్మల్ని ప్రేమించడం లేదు.. కేవలం నటిస్తున్నారని అర్థం.
ఒక వ్యక్తి మిమ్మల్ని నిజంగా మనస్పూర్తిగా ప్రేమిస్తే... మీకు నమ్మకం ఉంటుంది. మీ ఎఫర్ట్స్ కి ప్రాముఖ్యత ఇస్తారు. అలా కాకుండా... మీపై ఎలాంటి నమ్మకం పెట్టుకుండా.. మీకు ఏదైనా పని చెప్పినా చెయ్యరు, చేయలేరు అని అంటున్నారంటే వారికి మీ మీద ప్రేమ లేదనే అర్థం.
ఒక వ్యక్తి.... మీ కంటే... వారి అవసరాలకే ఎక్కువ విలువ ఇస్తున్నారు అంటే... సెల్ఫిష్ గా ప్రవర్తిస్తున్నారు అంటే... వారికి మీ మీద ప్రేమ లేదనే అర్థం.
మీ మీద, మీ అవసరాల మీద సానుభూతి చూపించడం, అండగా నిలపడాల్సిన చోట.. అండగా నిలపడలేకపోవడం లాంటివి చేస్తున్నారంటే వారికి మీ మీద ప్రేమ లేదనే అర్థం.
మీ మీద నమ్మకం లేకపోవడం, గౌరవం ఇవ్వకపోవడం, మర్యాదగా ప్రవర్తించడం లేదు అంటే కూడా మీరు ఒకసారి అలాంటి బంధం గురించి ఆలోచించాల్సిందే.