వీళ్లు వంకాయను తినకూడదు తెలుసా?

By Shivaleela RajamoniFirst Published Aug 23, 2024, 11:40 AM IST
Highlights

వంకాయ కూరను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. కానీ కొంతమంది వంకాయ కూరను పొరపాటున కూడా తినకూడదు. అసలు ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ప్రెగ్నెన్సీ టైంలో ఆడవారు మంచి పోషకాలున్న, హెల్తీ ఫుడ్ ను తినాలి. దీంతో కడుపులో బిడ్డ సక్రమంగా ఎదుగుతాడు. అయితే మన దేశంలో గర్భిణీ స్త్రీల ఆహారం ఎన్నో రకాల సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, కుటుంబ విధానం ద్వారా ప్రభావితమవుతుంది. చాలా మంది ప్రెగ్నెన్సీ టైంలో అత్తామామలు, అమ్మా నాన్నలు చెప్పిన విధంగా తింటుంటారు. ఈ టైంలో ఇవి తినకూడదు, అవి తినకూడదని సలహాలు ఇస్తుంటారు. చాలా మంది వీటిని ఫాలో అవుతాయి. ఇలా తినకూడదు అన్న వాటిలో వంకాయ ఒకటి. అవును ప్రెగ్నెన్సీ టైంలో వంకాయను తినకూడదు. ఆయుర్వేదం కూడా ఈ విషయాన్ని చెబుతోంది. 

నిజానికి వంకాయలో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో సాల్సిలేట్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఆస్పిరిన్ వంటి రక్తం సన్నబడటానికి ఉత్పత్తులలో కూడా ఈ సమ్మేళనం కనిపిస్తుంది. రక్తం సన్నబడటం గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు. ఇది ఆపలేని రక్తస్రావాన్ని కలిగిస్తుంది. అలాగే గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. వంకాయను ఎక్కువ మోతాదులో తింటేనే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇతర కూరగాయలతో పాటుగా వంకాయను మోతాదులో తింటే ఎలాంటి సమస్యలు రావు. 

Latest Videos

ప్రెగ్నెన్సీ టైంలో వంకాయను ఎందుకు తినకూడదు? 

వంకాయలో ఎన్నో రకాల ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు, పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వంకాయను తింటే గ్యాస్ సమస్యలు, నిద్రలేమి, అజీర్ణం వంటి సమస్యలు తగ్గిపోతాయి.  కానీ ఆయుర్వేదంలో ప్రెగ్నెన్సీ టైంలో వంకాయను తక్కువగా తినాలని చెప్తారు. ఆయుర్వేదం ప్రకారం గర్భధారణ టైంలో వంకాయను తినకపోవడమే మంచిది. కాబట్టి గర్భధారణ సమయంలో వంకాయ గర్భిణీ స్త్రీకి మరియు ఆమె పుట్టబోయే బిడ్డకు హానికరమని భావిస్తారు. ఎలాగంటే?

వంకాయను తింటే రుతుక్రమ ఉద్దీపన పెరుగుతుంది. ఎందుకంటే దీనిలో ఫైటోహార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని మీరు రోజూ తినడం మంచిది కాదు. దీనివల్ల గర్భం పోయే అవకాశం ఉంటుంది. 

ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ల శరీరంలో జరిగే మార్పుల వల్ల మహిళలు తరచుగా అసౌకర్యంగా ఉంటారు. శరీర నొప్పి కూడా ఉంటుంది. ఈ సమయంలో శారీరక శ్రమ లేకపోవడం వల్ల కొన్నిసార్లు గ్యాస్ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి వంకాయ తింటే ఎసిడిటీ మరింత పెరుగుతుంది. అందుకే వంకాయను తినకపోవడమే మంచిది.
 

click me!