Parenting tips: పసిపిల్లల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి!

పిల్లలను పెంచడం చాలా బాధ్యతతో కూడుకున్న పని. అందులోనూ పసి పిల్లలను చూసుకోవడం పెద్ద సవాలే. చాలామంది కొత్త పేరెంట్స్ కి అప్పుడే పుట్టిన పిల్లలను ఎలా చూసుకోవాలో తెలీదు. వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. కొత్త తల్లిదండ్రులు అస్సలు చేయకూడని పనులెంటో ఇక్కడ చూద్దాం.

Newborn Baby Care Tips Dos and Donts for New Parents in telugu KVG

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఇంట్లో ఉండే చిన్నపిల్లలను లేదా అప్పుడే పుట్టిన పిల్లలను, తల్లిని పెద్దవారే జాగ్రత్తగా చూసేకునేవారు. కానీ ప్రస్తుతం చిన్న కుటుంబాలు పెరిగిపోయాయి. దీనివల్ల పుట్టిన పిల్లలను ఎలా చూసుకోవాలో చాలామంది కొత్త తల్లిదండ్రులకు తెలియడం లేదు. పిల్లల సంరక్షణలో వాళ్లకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. 

నిజానికి పిల్లల్ని పెంచడం అనేది చాలా ముఖ్యమైన బాధ్యత. అందులోనూ అప్పుడే పుట్టిన పసిపిల్లలను బాగా చూసుకోవడం సవాలుతో కూడుకున్నది. కాబట్టి తల్లితో పాటు తండ్రి కూడా పిల్లల సంరక్షణలో బాధ్యత తీసుకోవాలి. అంటే బిడ్డకు డైపర్లు మార్చడం, రాత్రిపూట ఏడిస్తే ఓదార్చి నిద్రపుచ్చడం లాంటి అనేక విషయాల్లో తండ్రి కూడా పాల్గొనాలి. మరి కొత్త తల్లిదండ్రులు పసిపిల్లలను పెంచడంలో చేయకూడని పనుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Latest Videos

పిల్లల్ని చూసుకునే చిట్కాలు:

- పసిపిల్లలకు టైట్ గా ఉండే దుస్తులు వేయకండి. ముఖ్యంగా వారికి వేసే దుస్తుల్లో బటన్ల లాంటివి ఉండకూడదు. వారికి సౌకర్యంగా ఉండే దుస్తులు మాత్రమే వేయాలి. పిల్లల దుస్తులు వారి చర్మాన్ని నొక్కకూడదని గుర్తుంచుకోండి.

- సాధారణంగా పుట్టిన బిడ్డను చూడటానికి స్నేహితులు, బంధువులు ఇంటికి వస్తారు. వారందరికీ బిడ్డను ఇవ్వకండి. ఎందుకంటే చాలామంది చేతులు బిడ్డపై పడినప్పుడు అనేక అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బిడ్డను దూరంగా నిలబడి చూడమని చెప్పండి. దీన్ని మీరు కచ్చితంగా చెప్పినా తప్పులేదు.

- బిడ్డ తల్లి, తండ్రి ఇద్దరూ బిడ్డను ఎత్తుకునేటప్పుడు చేతులను బాగా కడుక్కుని ఆ తర్వాతే ఎత్తుకోవాలి.

- పసిపిల్లలు ఎక్కువసేపు నిద్రపోతారు. కానీ బిడ్డను మరీ ఎక్కువసేపు నిద్రపోనివ్వకండి.

- నిపుణుల ప్రకారం నిద్రపోతున్న బిడ్డను ఎప్పుడూ లేపి పాలు ఇవ్వకండి. బిడ్డ నిద్రలేచిన తర్వాత పాలు ఇవ్వవచ్చు. బిడ్డ పుట్టిన మొదటి కొన్ని వారాల్లో రోజుకు 2-3 గంటలకు ఒకసారి తప్పకుండా తల్లిపాలు ఇవ్వండి.

- కొందరు బిడ్డకు పాలు ఇచ్చిన వెంటనే ఊయలలో వేస్తారు. కానీ అది తప్పు. బిడ్డ పాలు తాగిన తర్వాత మీ భుజంపై బిడ్డను వేసుకొని బిడ్డ వీపును తట్టండి. బిడ్డకు తేన్పు వచ్చే వరకు వేచి ఉండండి. అలా రాకపోతే బిడ్డ కడుపునొప్పితో ఏడుస్తుంది లేదా వాంతి చేసుకుంటుంది.

- బిడ్డకు పాలు పట్టించిన తర్వాత అలా వదిలేయకుండా బిడ్డ పెదాలను మెత్తని తడి బట్టతో తుడవండి.

- నిపుణుల ప్రకారం బిడ్డకు ఒక సంవత్సరం వచ్చే వరకు తప్పకుండా తల్లిపాలు పట్టాలి. తల్లిపాలల్లోనే బిడ్డకు కావాల్సిన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆవు పాలు, ప్యాకెట్ పాలు, సెర్లాక్ లాంటివి అప్పుడే పెట్టకపోవడం మంచిది.

- బిడ్డ శరీరం వేడిగా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి తగిన చికిత్స తీసుకోండి.

- బిడ్డ నిద్రపోయేటప్పుడు, స్నానం చేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. బిడ్డ తల మూడు నెలల తర్వాతే సరిగ్గా ఉంటుంది. కాబట్టి బిడ్డను చూసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

vuukle one pixel image
click me!