మనం స్కూల్ కి వెళ్లడానికి ముందు మన పిల్లలను మనం ప్రిపేర్ చేయాలి. ముఖ్యంగా... ఆడపిల్లలకు కొన్ని ముఖ్యమైన విషయాలను నేర్పించాలట. అవేంటో ఓసారి చూద్దాం...
మూడేళ్లు నిండగానే మనం మన పిల్లలను స్కూలు కి పంపిస్తాం. వాళ్లు స్కూల్ ఏజ్ కి వస్తున్నారు అనగానే మనం ఏ స్కూల్లో చేర్పిస్తే బాగుంటుందా అని అని మంచి స్కూల్స్ ఏమున్నాయి అని వెతికేస్తాం. కానీ వాటికంటే ముందు.. మనం స్కూల్ కి వెళ్లడానికి ముందు మన పిల్లలను మనం ప్రిపేర్ చేయాలి. ముఖ్యంగా... ఆడపిల్లలకు కొన్ని ముఖ్యమైన విషయాలను నేర్పించాలట. అవేంటో ఓసారి చూద్దాం...
ఈరోజుల్లో కాలేజీకి వెళ్లే అమ్మాయిలే కాదు.. స్కూల్ కి వెళ్లే పిల్లలకు కూడా సేఫ్టీ ఉండటం లేదు. స్కూల్ పిల్లలను కూడా సెక్సువల్ ఇబ్బంది పెడుతున్నారు. అందుకే... మనం పిల్లలను స్కూల్ కి పంపే ముందే వారికి జాగ్రత్తలు చెప్పాలి.
పిల్లలకు స్కూల్ కి వెళ్లే ముందు.. మీ దగ్గర ఎలాంటి విషయాలు దాచుకూడదనే విషయాన్ని వారికి చెప్పండి. స్కూల్లో ఏం జరిగినా, ఎవరైనా తాకినా, ఏదైనా ఇబ్బంది పెట్టినా ఆ విషయం మీకు చెప్పే ధైర్యం మీరు పిల్లలకు ఇవ్వాలి. వారు అన్ని విషయాలు మీతో పంచుకునే స్వాతంత్రం ఇవ్వండి.
పిల్లలకు చిన్న వయసు నుంచే తప్పేదో, ఒప్పేదో నేర్పించాలి. దీని వల్ల..పిల్లలు చెడు స్నేహాలకు దూరంగా ఉంటారు. మంచికి, చెడుకి మధ్య బేధం తెలుసుకుంటారు.
ఎవరు ఏది చెప్పినా నమ్మేలా, మోసపోయే అంత అమాయకంగా పిల్లలను పెంచకూడదు. అప్రమత్తంగా ఉండేలా నేర్పించాలి. తొందరగా ప్రమాదంలో పడేలా కాకుండా చూసుకోవాలి. బయట వాళ్లను నమ్మి.. వారితో వెళ్లిపోవడం లాంటివి అస్సలు చేయకూడదని వారికి చెప్పండి.
పిల్లలకు గుడ్ టచ్ ఏది, బ్యాడ్ టచ్ ఏది అనే విషయాన్ని పిల్లలకు నేర్పించాలి. దాని వల్ల.. తమ పట్ల ఎదుటివారు ఏ ప్రవర్తనతో ఉన్నారు అనే విషయం వారికి తెలుస్తుంది.