గణేష్ చతుర్థి 2022: పిల్లల్లో సృజనాత్మకత పెంచే ఐడియాలు ఇవే..!

Published : Aug 31, 2022, 02:28 PM IST
 గణేష్ చతుర్థి 2022: పిల్లల్లో సృజనాత్మకత పెంచే ఐడియాలు ఇవే..!

సారాంశం

అవి పిల్లలో సృజనాత్మకత పెంచేలా ఉండటంతో పాటు... వారు కూడా అన్ని విషయాలను తెలుసుకోగులుగుతారు. వారికి కూడా పండగ అంటే బోరింగ్ కాదు.. చాలా  సరదాగా ఉంటుందనే విషయం అర్థమయ్యేలా చెప్పొచ్చు.

పిల్లలు పండుగలంటే చాలా ఉత్సాహంగా ఉంటారు. పండగల విశిష్టత మనం మన తర్వాతి తరానికి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అయితే... మామూలుగా చెబితే పిల్లలు పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. అందుకే.. వారికి ఈ పండగల ముఖ్య విషయాన్ని కథల ద్వారా.. లేదంటే ఆటల ద్వారా చెప్పే ప్రయత్నం చేయవచ్చు. అవి పిల్లలో సృజనాత్మకత పెంచేలా ఉండటంతో పాటు... వారు కూడా అన్ని విషయాలను తెలుసుకోగులుగుతారు. వారికి కూడా పండగ అంటే బోరింగ్ కాదు.. చాలా  సరదాగా ఉంటుందనే విషయం అర్థమయ్యేలా చెప్పొచ్చు.

ఈ వినాయకచివితి మీ పిల్లలో విజ్నానం నింపేలా... అంతేకాకుండా వారి సృజనాత్మకత పెంచేలా చేసే ఐడియాలు ఇవి...

లడ్డూస్ గేమ్: మీరు పిల్లలకి లడ్డూలను కనుగొనే పనిని ఇవ్వవచ్చు. కొన్ని స్లిప్పులలో ఆధారాలు ఇచ్చి ఇంట్లో దాచిన లడ్డూలను కనుగొనమని చెప్పండి. ఉదాహరణకు, పిల్లల టూత్ బ్రష్ దగ్గర ఒక  క్లూ ఉంచామని పిల్లలకు చెప్పండి. ఆ క్లూ నుంచి మరో క్లూ వెతికేలా.. ఇలా లడ్డూ కనిపెట్టాలి. ట్రెజర్ హంట్ లాగా.. లడ్డూ హంట్ చాలా సరదాగా ఉంటుంది.

గణేశ కలరింగ్ : మీ పిల్లలకు వినాయకుడి బొమ్మ గీసిన ఫోటోను ఇచ్చి.. దానికి రంగులు వేయమని చెప్పాలి. ఇది పిల్లల రంగు నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది. పిల్లల వయస్సు ప్రకారం రంగును పూరించడానికి సమయాన్నిఇవ్వాలి.

గణేశుడి పేరు: మీరు పిల్లలకు ఒక పేపర్, పెన్  ఇచ్చి దానిపై కొన్ని గణేశుని పేర్లు రాయమని చెప్పండి. దీనితో పాటు, పిల్లల వయస్సు ప్రకారం సమయాన్ని షెడ్యూల్ చేయండి. మీరు రిఫరెన్స్‌గా ఉపయోగించగల కొన్ని వినాయకుడి పేర్లు ఇక్కడ ఉన్నాయి. అవిఘ్న, భూపతి, అమిత్, చతుర్భుజ, దేవదేవ, ఏకదంత, గదాధర, గజానన, గణపతి, సిద్ధివినాయకుడు. దీని ద్వారా వినాయకుడికి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో వారు తెలుసుకోవచ్చు.


పూల అలంకరణ: పండుగ రోజున... మీ పిల్లలను ఇల్లు, బాల్కనీ లేదా ప్రార్థనా స్థలాన్ని అలంకరించమని అడగండి. ఈ రోజున మీరు ఏదైనా రంగు  పువ్వులతో అలంకరించవచ్చు. ఇది పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతుంది. పండగ రోజును ఇంటిని శుభ్రంగా, అందంగా అలకరించుకోవాలి అనే విషయం తెలుస్తుంది.

జంబుల్  గేమ్: మీ పిల్లలకు పేపర్ పెన్ ఇవ్వాలి. వినాయకుని వివిధ పేర్లతో జంబుల్ నేమ్ గేమ్ ఆడటం ప్రారంభించండి. జంబుల్ నేమ్ గేమ్ కోసం, ప్రతి పేరును ఒక కాగితంపై ఒక గందరగోళం రూపంలో వ్రాయండి. అంటే పజిల్ రూపంలో రాయాలి. ఇలా రాసి పేర్లు కనుక్కోమని చెప్పాలి. ఇలా చేయడం వారికి కూడా సరదాగా ఉంటుంది. వినాయకుడి పేర్లు కూడా తెలుస్తాయి.

PREV
click me!

Recommended Stories

Best School: మీ పిల్లలకు ఏ స్కూల్ బెస్ట్? CBSE, ICSE, స్టేట్ సిలబస్ లో ఏది మంచిది?
Kids Health: పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు అరటిపండు, పెరుగు పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది?