అసలు బాలల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

By Shivaleela RajamoniFirst Published Nov 14, 2023, 10:39 AM IST
Highlights

childrens day 2023 : ప్రతి ఏడాది నవంబర్ 14  న భారతదేశంలో బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి ఈ సందర్భంగా పిల్లలకు ఎలా శుభాకాంక్షలు చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

childrens day 2023 : ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మీకు తెలుసా? భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ రోజునే జన్మించారు. నెహ్రూకు పిల్లలంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకే ఆయన జయంతిని బాలల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి బాలల దినోత్సవాన్ని అసలు ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం పందండి. 

బాలల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం వెనుకున్నముఖ్య ఉద్దేశ్యం.. దేశంలో పిల్లల మెరుగైన భవిష్యత్తు, విద్య, ఆరోగ్యం పై అవగాహన పెంచడం. పండిట్ నెహ్రూ గారి ప్రకారం.. పిల్లలే రేపటి దేశ భవిష్యత్తుకు పునాదులు. అదుకే వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం, వారిని బాగా చూసుకోవడం ముఖ్యం.

1954 లో ఐక్యరాజ్యసమితి బాలల దినోత్సవాన్ని నిర్వహించాలని ముందుగా ప్రకటించింది. అయితే 1964 లో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మరణించారు. భారత పార్లమెంటు మొదటి ప్రధానమంత్రి జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించింది. అప్పటి నుంచి జవహార్ లాల్ నెహ్రూ జన్మదినమైన నవంబర్ 14 ను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 

బాలల దినోత్సవం జరుపుకోవడానికున్న ముఖ్య ఉద్దేశ్యం దేశంలో పిల్లల శ్రేయస్సు, విద్య, అభివృద్ధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. ఈ రోజు పిల్లలకు ఎంతో ప్రత్యేకమైంది. ఈ రోజు పిల్లల నైపుణ్యాలను పెంచడానికి ఎన్నో రకరకాల కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటిలో పిల్లలు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా పాల్గొంటుంటారు. పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థల్లో పిల్లల కోసం సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.

బాలల దినోత్సవం ప్రాముఖ్యత

  • బాలల హక్కులను పెంపొందించాలి
  • పిల్లల విద్యను ప్రోత్సహించాలి.
  • పిల్లల అభిప్రాయాలను కూడా గౌరవించాలి.
  • పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి.
  • పిల్లలకు విద్యపైనే కాకుండా గేమ్స్, వినోదంపై కూడా అవగాహన కల్పించాలి.
  • పిల్లల సృజనాత్మక కృషిని ఎల్లప్పుడూ ప్రోత్సహించాలి.
click me!