టెండర్ ఓట్ అనే విషయం తెరమీదకు రాగానే అందరూ దీని గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అసలు టెండర్ వోట్ అంటే ఏమిటి ఎవరు వేస్తారు? ఎందుకు వేస్తారు? అనేది తెలుసుకుందాం.
నిన్న ముగిసిన తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో టెండర్ ఓట్ పడడం వల్ల ఇప్పటికే మహబూబ్ నగర్ లోని ఒక పోలింగ్ కేంద్రంలో రిపోలింగ్ కి ఆదేశించింది ఎన్నికల కమిషన్. కామారెడ్డిలో కూడా ఇలానే ఒక టెండర్ వోట్ పడడంతో అక్కడ కూడా రీ పోలింగ్ కి ఆదేశించే సూచనలు కనబడుతున్నాయి.
Also read; టెండర్ ఓటు ఎఫెక్ట్: మహాబూబ్‌నగర్‌లో ఐదుగురిపై సస్పెన్షన్ వేటు
undefined
ఒక్కసారిగా ఈ టెండర్ ఓట్ అనే విషయం తెరమీదకు రాగానే అందరూ దీని గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అసలు టెండర్ వోట్ అంటే ఏమిటి ఎవరు వేస్తారు? ఎందుకు వేస్తారు? అనేది తెలుసుకుందాం.
ఒక పోలింగ్ కేంద్రంలో గనుక ఒక ఓటర్ కి బదులు వేరెవరో వచ్చి దొంగ వోట్ వేసి వెళ్లిన తరువాత గనుక అసలైన ఓటర్ వచ్చి, నా వోట్ హక్కును నేను వినియోగించుకోకముందే ఎలా నావోటే పడింది అని ప్రశ్నిస్తే అప్పుడు ఆ సదరు ఓటర్ కి మల్లి వోట్ వేసే అవకాశం కల్పిస్తారు. దాన్నే టెండర్ వోట్ అని అంటారు.
టెండర్ ఓట్ ఎలా వేయాలి?
అందరిలా కాకుండా టెండర్ ఓట్ వేసే వ్యక్తికి ఒక ప్రత్యేకమైన బ్యాలట్ పేపర్ ఇస్తారు. దీన్నే మనం ఫారం 17 బి అని పిలుస్తుంటాము. ఆ బ్యాలట్ పేపర్ పైన ఆ సదరు వ్యక్తి తన ఓటును నమోదు చేస్తాడు. అలా ఆ వ్యక్తి ఆ పోలింగ్ బూత్ లోనే తను వోట్ వేసిన బ్యాలట్ పేపర్ ని సదరు ఎన్నికల అధికారికి అప్పగిస్తాడు.
Also read; ఫెస్ రికగ్నేషన్ యాప్ ద్వారా ఓటింగ్
ఆ బ్యాలట్ పేపర్ ని సీల్డ్ కవర్ లో పెట్టి పోలింగ్ ఆఫీసర్ ఎన్నికల సంఘానికి సమర్పిస్తాడు. ఈ టెండర్ ఓట్ ని ఓట్లను లెక్కించేటప్పుడు లెక్కించరు. ఆశైల వ్యక్తి ప్లేసులోనే వేరేవాళ్లేసినా దొంగ ఓటునే పరిగణలోకి తీసుకుంటారు.
రీపోలింగ్ ఎందుకు...?
మామూలుగా అయితే టెండర్ ఓట్లు చాలా అరుదు. నిన్న కూడా మొత్తం రాష్ట్రంలోనే కేవలం రెండు చోట్ల మాత్రమే ఇలా టెండర్ ఓట్లు పడ్డాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలప్పుడు ఒకటి రెండు ఓట్లు పెద్ద తేడా చూపించావు కాబట్టి, పెద్దగా పట్టించుకోరు. కానీ మునిసిపల్ ఎన్నికల్లో ఒక వార్డులో గెలుపోటములను డిసైడ్ చేసేది ఒకటి రెండు ఓట్లే కాబట్టి దానిపై ఇంత సీరియస్ గా ఉంది ఎన్నికల సంఘం.