భారతదేశంలో వాక్సినేషన్ ఎలా సాగుతుంది..?

By team telugu  |  First Published May 27, 2021, 1:03 PM IST

కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు భారత ప్రభుత్వం వాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుడుతుందనగానే ప్రపంచం కండ్లన్నీ భారతదేశం వైపుగా చూశాయి.


బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సీఈఓ అఖిలేష్ మిశ్రా ఈ వ్యాసాన్ని ఇంగ్లీష్ లో రాసారు. దాని తెలుగు అనువాదాన్ని మీకు అందిస్తున్నాము.

కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు భారత ప్రభుత్వం వాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుడుతుందనగానే ప్రపంచం కండ్లన్నీ భారతదేశం వైపుగా చూశాయి. ప్రపంచంలోనే అత్యధిక వాక్సిన్లను ఉత్పత్తి చేసే దేశమవడంతో యావత్ ప్రపంచం దృష్టిని భారతదేశం ఆకర్షించింది. భారతదేశం ఈ వాక్సినేషన్ ప్రక్రియను ఎలా విజయవంతం చేస్తుందో చూడడానికి సైతం ప్రపంచ దేశాలు దృష్టిసారించాయి. మనము కూడా ఈ సందర్భంగా భారతదేశం, ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూద్దాము. 

Latest Videos

undefined

వాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యమవుతుందా..?

25 మే నాటికి భారత ప్రభుత్వం 196.4 మిలియన్ దోషుల వాక్సిన్లను ప్రజలకు ఇచ్చింది. అమెరికా మినహా మారె ఇతర దేశం కూడా ఇంతకన్నా ఎక్కువ వాక్సిన్లను అధికారికంగా ఇచ్చింది లేదు. అమెరికా మనకన్నా ఎక్కువ వాక్సిన్ దోషులను ఇచ్చినప్పటికీ... అమెరికా భారతదేశం కన్నా చాలా కాలం ముందే వాక్సినేషన్ ప్రక్రియను ఓరారంభించిందన్న విషయాన్నీ మర్చిపోవద్దు. 170 మిలియన్ దోషుల టీకాలను ఇవ్వడానికి అమెరికాకి 115 రోజులు, చైనాకి 119 రోజులు పడితే... భారతదేశం ఈ మైలురాయిని కేవలం 114 రోజుల్లోనే పూర్తిచేసింది. 

భారత్ లో వాక్సిన్ కొరత ఉందా..?

ప్రపంచంలోనే సొంతగా వాక్సిన్లను తాయారు చేస్తున్న అతి కొన్ని దేశాల్లో భారత్ కూడా ఒకటి. భారత్ బయో టెక్ తాయారు చేసిన కొవాగ్జిన్, సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవిషిల్డ్ వాక్సిన్లతోపాటు స్పుత్నిక్ ని కూడా తాజాగా భారత్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. 

అతి తక్కువ కాలంలో వాక్సిన్లను భారతీయులకు అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది. ఏ దేశంలోనూ కూడా వాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమైనాయి నుండే అందుబాటులోకి రాలేదు. అతి కొద్దీ సమయంలో ఇన్ని మిలియన్ దోషులను భారత ప్రభుత్వం అందించడమంటే అది చాలా గొప్ప అనే చెప్పాలి. ఒక పక్క కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ... వాక్సిన్ల కొరత ఉందా అనే విషయం గురించి చర్చిండం కరెక్ట్ కాదు. వాక్సిన్ల లెక్కల ప్రకారంగా చూస్తే భారతదేశం మిగిలిన దేశాలకన్నా చాలా బెటర్ అని చెప్పక తప్పదు. 

ప్రజలకు టీకాలు ఇవ్వడంలో భారత్ వెనకబడిందా..?

భారత్ లో మరణాలు, కేసుల విషయానికి వచ్చేసరికి అసలైన నంబర్ల గురించి మాట్లాడి, వాక్సిన్ల విషయంలో శాతాల గురించి మాట్లాడడం తగదు. డేటాను తమకనుకూలంగా వాడుకునే కొందరి ప్రయత్నం ఇది. ఈ విషయం గురించి మనం చర్చించే ముంది వాక్సిన్ల తయారీ అనేది కంపెనీ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. దాని శక్తి మేర కంపెనీ వాక్సిన్లను ఉత్పత్తి చేయగలుగుతుంది కానీ అంతకన్నా ఎక్కువ అయితే చేయలేదు. 

భారత్ లో వాక్సినేషన్ ప్రక్రియ ప్రాంభమయిననాటి నుండి అంటే... 16 జనవరి 2021  నుంచి ప్రపంచవ్యాప్తంగా(చైనా కాకుండా)1,135  మిలియన్ డోసులను ఇచ్చారు. ఇందులో భారతదేశం వాటా 196 మిలియన్ దోషుల పైచిలుకు. అంటే దాదాపుగా 17 శాతం అన్నమాట..!

భారత్ సరిపడా వాక్సిన్లను ముందుగా ఆర్డర్ ఇచ్చిందా..?

వాక్సిన్లను సొంతగా తయారుచేసుకునే భారత్ వంటి దేశానికి వాక్సిన్లను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. ఆ విషయం ఇక్కడ అప్రస్తుతం. వాక్సిన్లను సోనాథగా తాయారు చేసుకోలేని దేశాలు ఇంపోర్ట్ చేసుకోవాలి కానీ భారతదేశానికి ఆ అవసరం లేదు. మరికొందరేమో కెనడా దాని పోపులేషన్ కన్నా 5 రేట్లు అధికంగా వాక్సిన్లను దిగుమతి చేసుకుంది అని అంటున్నారు. కానీ అందులో వారు వాడినవి ఎన్ని..?

భారతదేశం నుండి వాక్సిన్ల ఎగుమతిని ఆపేసిన తరువాత ఆ వాక్సిన్లన్ని ఎక్కడికీ వెళ్లడం లేవు కదా, అన్ని కూడా ప్రజలకే ఇస్తున్నారు. మన దగ్గరే సొంతగా రెండు కంపెనీలు వసీసీన్లను తాయారు చేస్తుండగా, మనం వేరే దగ్గరినుండి వాక్సిన్లను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, ఎగుమతి ఆపేయడం అంటే... 2 బిలియన్ దోషులను మనం ఆర్డర్ ఇచ్చినట్టే కదా..!

మరి భారతదేశం వాక్సిన్లను ఎందుకు ఎగుమతి చేసినట్టు..?

భారతదేశం ఇప్పటికే 196 మిలియన్ డోసుల పైచిలుకు టీకాలను ప్రజలకు ఇచ్చింది. కేవలం 66 మిలియన్ దోషులను మాత్రమే ప్రర్పంచ దేశాలకు ఎగుమతి చేసింది. ఈ 66 మిలియన్ డోసులలో 10 మిలియన్ దోషులను 2పెద్ద దేశాలకు, వారి వద్ద ఎటువంటి తయారీ వ్యవస్థ లేని చిన్న దేశాలకు భారత ప్రభుత్వం ఇచ్చింది. మరో 35 మిలియన్ డోసులు రకరకాల దేశాలతో ఉన్న వివిధ ఇప్పందాలనుసారంగా పంపించడం జరిగింది. మరో 20 మిలియన్ డోసులను ఐరాస ప్రతిపాదించిన కోవాక్స్ కి ఇవ్వడం జరిగింది. 

ప్రపంచం లో భారతదేశానికి అన్ని దేశాలు మద్దతివ్వాలని మనం కోరుకున్నప్పుడు వారికి వాక్సిన్లను ఇవ్వము అని అనలేము. అంతే కాకుండా... భారతదేశం ఇలా వాక్సిన్లను ఎగుమతి చేసింది కాబట్టే సెకండ్ వేవ్ ఇంత భయంకరంగా మనల్ని ముంచెత్తుతున్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ మన వెంటా ఉన్నాయి. మనకు అండగా నిలిచాయి. 

దేశీయ వాక్సిన్ ఉత్పత్తి గురించి... 

వాక్సిన్ ఉత్పత్తి మొదలయిందే మొన్న మొన్న. కరోనా మహమ్మారి వచ్చి దాని స్థాయిని అంచనా వేసి మన వాక్సిన్ ఉత్పత్తిదారులు చాలా త్వరగానే వాక్సిన్ కనుక్కున్నారని చెప్పాలి. ఉన్నపళంగా వాక్సిన్ ఉత్పత్తగీ సామార్థ్యాన్ని పెంచలేమనేది వాస్తవం. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం రకరకాల చర్యలను ప్రారంభించింది. 

జులై 2021 నాటికి భారత ప్రభుత్వం 510 మిలియన్ డోసుల వాక్సిన్లను ప్రజలకు ఇవ్వాలనే సంకల్పంతో ఉంది. ఇప్పటికే ఇందుకోసం అవసరమైన ఆర్డర్స్ ని ప్రభుత్వం సదరు కంపెనీలకు ఇచ్చింది. 2021 చివరి నాటికి 2.16 బిలియన్ డోసుల వాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. 

ప్రస్తుత పరిస్థితి 

శాస్త్రీయంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాలనుసారం భారతదేశంలో వాక్సినేషన్ ప్రక్రియ సాగుతుంది. తొలుత హెల్త్ కేర్ వర్కర్స్ కి, ఆ తరువాత ఫ్రంట్ లైన్ వారియర్స్ కి, ఆ తరువాత 60 సంవత్సరాల వారికి, ఆతరువాత 45 సంవత్సరాల వారికి ఇలా విడతల వారీగా శాస్త్రీయంగా వాక్సినేషన్ ని మొదలుపెట్టిన భారతదేశం ఇప్పుడు 18 సంవత్సరాల వయసు పైబడిన అందరికీ... వాక్సిన్లను అందించడం మొదలుపెట్టింది. ఇప్పటికే 28.66 మిలియన్ల మంది 18 - 44 సంవత్సరాల వయసు మధ్యవారికి కూడా టీకా ఇవ్వడం జరిగింది. 

ప్రస్తుతానికి వేరే దేశాల్లో అత్యవసర అనుమతి పొందిన వాక్సిన్లను భారతదేశంలో కూడా భారత ప్రభుత్వం అనుమతించనుంది. భారత్ బయో టెక్ 18 సంవత్సరాల లోపు వారిపై కూడా వాక్సినేషన్ ట్రయల్స్ ని ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది., దేశాన్ని వణికించిన సెకండ్ వేవ్ ప్రస్తుతానికి ఒక కొలిక్కి వచ్చినట్టుగానే కనబడుతుంది. మందులు, ఆక్సిజన్ డిమాండ్ క్రమేపి తగ్గుతుంది. బహుశా మరికొన్ని రోజుల్లో మనం ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేటట్టే కనబడుతుంది. 

- అఖిలేశ్ మిశ్రా

[రచయిత న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్ బ్లూ క్రాఫ్ట్ ఫౌండేషన్ కంపెనీకి సీఈఓ. దానికి పూర్వం సిటిజెన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ ఫారం mygov కి డైరెక్టర్ (కంటెంట్) గా కూడా వ్యవహరించారు.]

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం. #ANCares #IndiaFightsCorona

click me!