ఎప్పుడో 2012లో ఈ నిర్భయ సంఘటన జరిగినా క్రింది కోర్టులు 2014లోనే ఉరి శిక్షను ఖరారు చేసినా వీరిని ఉరి తీయడానికి ఎందుకింతకాలం పట్టిందనేది ఇప్పుడు అందరి మెదళ్లలోనూ మెదులుతున్న ఒక ప్రశ్న.
ఢిల్లీలో 23 ఏళ్ల ఫీజియోథెరపీ స్టూడెంట్ నిర్భయను అత్యంత క్రూరంగా గ్యాంగ్ రేప్ చేసి చంపినా కేసులో నలుగురు దోషులను నేటి ఉదయం ఉరి తీసిన విషయం తెలిసిందే!ఎప్పుడో 2012లో ఈ నిర్భయ సంఘటన జరిగినా క్రింది కోర్టులు 2014లోనే ఉరి శిక్షను ఖరారు చేసినా వీరిని ఉరి తీయడానికి ఎందుకింతకాలం పట్టిందనేది ఇప్పుడు అందరి మెదళ్లలోనూ మెదులుతున్న ఒక ప్రశ్న.
కింది కోర్టులు మరణ శిక్ష విధించినా, ఆ మాటకొస్తే ఏ శిక్ష విధించినా పై కోర్టుకు వెళ్లే వీలుంటుంది. ఒక్క నిర్దోషికి కూడా చేయని తప్పుకు శిక్ష పడకూడదనే మన న్యాయ సిద్ధాంతానికి అనుగుణంగా ఈ ఈ వెసులుబాటును కల్పించింది భారత రాజ్యాంగం.
undefined
అందరిని ఎందుకు ఒకే సారి ఉరి తీశారు...?
ఇక సుప్రీమ్ కోర్టులో కూడా వీరి వాదనలు అన్ని పూర్తయిన తరువాత కూడా వీరంతా ఉరి శిక్షనుంచి చాలా కాలం తప్పించుకున్నారు. ఇక్కడ మామూలుగా మనకందరికీ వచ్చే ఒక ప్రశ్న. ఒక్క నిందితుడు పిటిషన్ దాఖలు చేస్తే...మిగిలిన ఆ ఒక్కడిని ఆపి మిగిలిన ముగ్గురిని ఉరి తీయొచ్చు కదా, లేదా అందరిని వేర్వేరుగా ఉరి తీయొచ్చుకదా అని అనిపించడం సహజం.
కానీ సుప్రీమ్ కోర్ట్ శత్రుఘన్ చౌహన్ కేసులో ఒక తీర్పునిచ్చింది. ఒక హత్యలో ఒకరికన్నా ఎక్కువమంది నిందితులు ఉంటే.... అందరినీ ఒకేసారి ఉరి తీయాలని, వేర్వేరుగా కాదని తెలిపింది. ఇలా ఈ కేసు జడ్జిమెంట్ ఉండడంతో నిందితులు ఒక్కొక్కరిగా తమ పిటిషన్లను దాఖలు చేసి కాలయాపన సాగించారు.
Also read: ఉరికి ముందు కూడా డ్రామాలు ఆపని నిర్భయ దోషులు, ఏమి చేశారంటే...
ఇక ఇలా ఒక్కొక్కరు పిటిషన్లను దాఖలు చేయడంతోపాటు వారు న్యాయ వ్యవస్థలోని మరొక లొసుగును కూడా వాడుకున్నారు. సాధారణంగా సుప్రీమ్ కోర్టు తన తీర్పును వెలువరించిన తరువాత దోషికి రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. రివ్యూ పిటిషన్ ను దాఖలు చేయడానికి 30 రోజుల గడువు ఉంటుంది.
ఆ గడువు లోపల మాత్రమే రివ్యూ పిటిషన్ ని దాఖలు చేయాల్సి ఉంటుంది. సుప్రీమ్ కోర్టు అశోక్ హుర్రా కేసులో క్యూరేటివ్ పిటిషన్ అనే నూతన ఒరవడికి నాంది పలికింది. సుప్రీమ్ కోర్టు రివ్యూ పిటిషన్ ద్వారా న్యాయం పూర్తి స్థాయిలో జరగలేదు అని భావిస్తే సదరు వ్యక్తి మరల సుప్రీమ్ ధర్మాసనం ముందు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయొచ్చు.
ఈ క్యూరేటివ్ పిటిషన్ ను ఎంత గడువు లోపల దాఖలు చేయాలనీ సుప్రీమ్ కోర్టు స్పష్టం చేయకపోవడంతో ఈ లొసుగును వాడుకున్నారు. ఇక ఈ క్యూరేటివ్ పిటిషన్ ను కూడా గనుక సుప్రీమ్ కొట్టివేస్తే వారు మరల రాష్ట్రపతి వద్దకు క్షమాభిక్ష కోసం అప్లై చేసుకున్నారు.
ఇలా ఈ మూడు లొసుగులను ఉపయోగించుకుంటూ ఇంతకాలం కాలం వెళ్లదీశారు. ఈ మూడింటిని కలిపి ఎలా వాడుకున్నారా ఒకసారి చూద్దాం.
అన్ని లొసుగులను కలిపి ఎలా వాడారంటే....
నలుగురు దోషుల్లో తొలుత ఒకరు రివ్యూ పిటీషన్ దాఖలు చేస్తారు. అది కూడా నెల రోజుల గడువు ముగుస్తుండగా దాఖలు చేస్తారు. ఆ తరువాత రివ్యూ పిటిషన్ ని సుప్రీమ్ కోర్టు వింటుంది. ఆ రివ్యూ పిటిషన్ ను కూడా గనుక కొట్టేస్తే మరల డెత్ వారెంట్ వచ్చే దాకా వెయిట్ చేసి ఉరి శిక్ష మరో రెండు రోజుల్లోనో, ఒక్క రోజులోనో ఉందనగా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తారు.
కోర్టు మరల ముగ్గురు జడ్జిలతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపడుతుంది. ఆ క్యూరేటివ్ పిటిషన్ ని కూడా గనుక కోర్టు కొట్టేస్తే.... మరల డెత్ వారెంట్ వచ్చే వరకు ఆగుతారు.
Also read: నిర్భయ దోషులు చివరి రోజు ఎలా ప్రవర్తించారంటే..: వారి జీవితాలు ఇవీ...
మరల ఆ డెత్ వారెంట్ వచ్చింది అనుకున్నాక, ఉరి ఇంకో రెండు రోజులో ఒక్క రోజో ఉందనగా రాష్ట్రపతి వద్దకు క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకుంటారు. అది కూడా తిరస్కరణకు గురయిన తరువాత, నలుగురు నిందితుల్లో ఒకడు తన పూర్తి లీగల్ ఆప్షన్స్ ను వాడుకుంటున్నట్టయిపోతుంది. అతడి ముందు ఇక ఏ ఆప్షన్స్ కూడా ఉండవు.
అప్పుడు నిందితుల్లో రెండవ వాడు స్క్రీన్ మీదకు వస్తాడు. నలుగురు నిందితుల్లో రెండవ వాడు మరలా ఈ మొత్తం పద్ధతిని ఫాలో అవుతారు. ఇలా చట్టంలో ఉన్న ఈ లొసుగులు వాడుకొని ఇన్ని రోజుల పాటు ఉరి శిక్షను తప్పించుకోగలిగారు.
కానీ భారతీయ న్యాయవ్యవస్థ మాత్రం వారికి ఇవ్వవలిసిన ప్రతి ఒక్క అవకాశాన్ని ఇవ్వడంతో పాటు బాధితురాలి తరుఫు వారికి న్యాయం జరిగేలా చూసింది. అందుకే నేడు సుప్రీమ్ బయట జస్టిస్ ఐస్ డిలేయిడ్ బట్ నాట్ డినయిడ్ అని పోస్టర్లు వెలిశాయి.
ఇలా ఒకరికంటే ఎక్కువ మంది నేరస్థులు ఉంటె ఒకేసారి ఉరితీయాలని సుప్రీమ్ తీర్పును పునఃసమీక్షించాలని కేంద్రం కోరనుంది. కోర్ట్ ఇంకొన్ని రోజుల్లో దాన్ని స్వీకరించే ఆస్కారం ఉంది. దానితోపాటు క్యూరేటివ్ పిటిషన్ ఫైల్ చేయడానికి కూడా నిర్ణీత కాల వ్యవధిని సూచించాలని కోరనుంది.