"డియర్ కామ్రేడ్" ఇక గతమే: తెలుగు సినిమాలకు బ్యాక్ డ్రాప్ సరుకు

By telugu team  |  First Published Aug 16, 2019, 5:47 PM IST

అప్పట్లో ఒకడుండేవాడు. గమ్యం, దొరసాని, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలను పరిశీలిస్తే విప్లవానికి సంబంధించిన లేదా కమ్యూనిజానికి సంబంధించిన అంశాలను తడుముతున్నప్పటికీ ప్రధాన ఇతివృత్తం వేరేగా ఉండడం గమనించవచ్చు.


హైదరాబాద్: మాదాల రంగారావు ఎర్రమల్లెలు సినిమాతో ప్రారంభమైన విప్లవ సినిమాల ఊపును ఆర్. నారాయణ మూర్తి కొనసాగిస్తూ వచ్చారు. విప్లవం ఒక ఆదర్శంగా కొనసాగుతూ యువతను ఆకర్షిస్తున్న దశ అది. వర్గ శత్రు నిర్మూలన అనేది ఆ సినిమాలకు మూలం. ఆ సినిమాల్లోని పాటలు కూడా యువతను ఉర్రూతలూగిస్తూ వచ్చాయి. 

కమర్షియల్ సినిమాలకు ఉన్నట్లే వాటికి కూడా ఓ మూస ఉంటూ వచ్చింది. మా భూమి, దాసి వంటి సినిమాలు వాటికి మినహాయింపు. విప్లవోద్యమం ఇప్పుడు ఓ జ్ఞాపకంగా మిగిలినపోయిన విషయాన్ని ఇప్పటి సినిమాలు పట్టిస్తున్నాయా అనే అనుమానం రాక మానదు.

Latest Videos

undefined

అప్పట్లో ఒకడుండేవాడు. గమ్యం, దొరసాని, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలను పరిశీలిస్తే విప్లవానికి సంబంధించిన లేదా కమ్యూనిజానికి సంబంధించిన అంశాలను తడుముతున్నప్పటికీ ప్రధాన ఇతివృత్తం వేరేగా ఉండడం గమనించవచ్చు. అప్పట్లో ఒక్కడుండేవాడు అనే సినిమాలో ఓ క్రికెటర్ జీవితం ఎలా మలుపు తిరిగిందనే విషయాన్ని నక్సలిజం నేపథ్యంగానే చేశారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు తెర మీద కొత్త రాగం పాడింది కూడా. 

గమ్యం సినిమాలో కూడా విప్లవోద్యమానికి సంబంధించిన సంఘటనలు ఉన్నాయి. అల్లరి నరేష్ పోషించిన పాత్ర మరణానికి అదే కారణమవుతుంది. నక్సలైట్లకు, పోలీసులకు మధ్య జరిగే దాగుడుమూతల్లో హీరో, అతని స్నేహితుడు చిక్కుకుంటారు. అది కథను మలుపు తిప్పుతుంది కూడా. 

దొరసాని సినిమాలో కూడా విప్లవోద్యమం నేపథ్యంగా ఓ ప్రేమకథను తెరకెక్కించారు. పరువు హత్యల నేపథ్యంలో ఈ సినిమా వచ్చినప్పటికీ నేపథ్యం ఆ ఉద్యమానికి సంబంధించిందే. డియర్ కామ్రేడ్ అనే సినిమా గురించి చెప్పనక్కర్లేదు. దాని గురించి చర్చ కూడా సాగింది. హీరో పోరాటాలు చేస్తూ ఈ కమ్యూనిస్టు నాయకుడుగానే పరిచయమవుతాడు. కామ్రేడ్ అనే పదానికి మిత్రుడు అనే అర్థం ఉన్నప్పటికీ కమ్యూనిస్టుల సంబోధనకు అది సంకేతంగా మారింది. 

click me!