మారుతీ రావు రెండు తప్పులు: వాటి మూల్యం... ఇద్దరికి వైధవ్యం!

By Sree SFirst Published Mar 9, 2020, 12:58 PM IST
Highlights

కూతురు అమృత భర్త ప్రణయ్ హత్య నుంచి మొదలుకొని తన ఆత్మహత్య వరకు మారుతీ రావు రెండు తప్పులను చేసాడు. ఈ రెండు తప్పులకు మాత్రం భారీ మూల్యాన్ని మరో ఇద్దరు మహిళలు చెల్లించుకున్నారు. 

కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కారణంగా పరువు పోయిందని భావించిన మారుతీ రావు అల్లుడు ప్రణయ్ ని అత్యంత కిరాతకంగా హత్య చేయించాడు.

అతను వాస్తవానికి భర్త చనిపోగానే కూతురు అమృత తన దగ్గరకు తిరిగి వస్తుందని భావించినప్పటికీ... అమృత తిరిగి రాకపోతుండడం కేసు హియరింగ్ కి వచ్చే సమయం దగ్గర పడుతుండడంతో మారుతీ రావు కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. 

కూతురు అమృత భర్త ప్రణయ్ హత్య నుంచి మొదలుకొని తన ఆత్మహత్య వరకు మారుతీ రావు రెండు తప్పులను చేసాడు. ఈ రెండు తప్పులకు మాత్రం భారీ మూల్యాన్ని మరో ఇద్దరు మహిళలు చెల్లించుకున్నారు. 

Also read: ఒంటరైన మారుతీరావు భార్య..? నేరం ఎవరిది..? శిక్ష ఎవరికి?

మారుతీ రావుకి కూతురిపై ఉన్న ప్రేమ వల్ల, కూతురి వల్ల పరువు పోయిందన్న బాధవల్ల, (బహుశా పరువు పోయిందన్న బాధ ఎక్కువ ఉండొచ్చు) కారణం ఏదైతేనేమి కిరాయి హంతకులను పెట్టి అల్లుడు ప్రణయ్ ని అత్యంత పాశవికంగా నరికించాడు. దాని ఫలితంగా కూతురు విధవగా మిగిలిపోయింది. 

కన్న కూతురు విధవగా ఉండడం చూసి ఏ తండ్రయినా తట్టుకోలేడు. అందుకే కాబోలు కూతురిని వెనక్కి తెచ్చుకోవడానికి  విశ్వ ప్రయత్నాలు చేసాడు. కూతురిని ఇంటికి రమ్మని కోరడం నుండి మొదలు బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా కూతురిని తెచ్చుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసాడు. 

కూతురు గర్భవతిగా ఉన్నప్పుడే కూతురిని గర్భం తీసేపించుకోవాల్సిందిగా ఆమెపై ఒత్తిడి తెచ్చాడు కూడా. బహుశా కూతురిని వెనక్కి తీసుకెళ్లే ఆలోచనను ఆయన ఏ నాడు కూడా విరమించలేదు, ప్రణయ్ ని అల్లుడుగా కూడా అంగీకరించలేదు. 

ఈ తతంగం జరుగుతుండగానే ప్రణయ్ హత్యా, మారుతీ రావు జైలుకెళ్లడం కూడా జరిగిపోయాయి. బెయిల్ పైన విడుదలైన మారుతీ రావు కూతురిపై మరోదఫా ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడు. వెనక్కు రమ్మని మరల రాయబారాలు స్టార్ట్ చేసాడు. 

ఈ సారి కూతురిపై ప్రేమతోపాటుగా ప్రణయ్ హత్యా కేసు హియరింగ్ కి వస్తుందన్న టెన్షన్ కూడా అతనిలో ఉండుంటుంది. అందుకోసమని అమృతను తనవైపుగా తిప్పుకుంటే కేసు నుంచి బయటపడొచ్చానో, లేదా తక్కువ శిక్ష పడుతుందనే ఏదో ఒకటి మాత్రం ఆయన ఆలోచించాడు. 

Also read: మారుతీరావు ఆత్మహత్య: వీలునామా చుట్టూనే కథ, ఆదివారం కలవాల్సిన లాయర్‌ ఎవరు..?

కానీ కూతురు ససేమిరా అనడంతో, ఆయన ఆస్తిని కూడా రాసిస్తానని రాయబారం పంపాడు. కానీ ఏం లాభం కూతురు మాత్రం తిరిగిరాలేదు. దానితో మనస్తాపానికి లోనైనా మారుతి రావు ఏ కూతురికోసమైతే ఇదంతా చేసాడో.. ఆ కూతురే ఇలా తన మాట వినకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక తనువు చాలించాడు. 

ఇలా మరణించడం మారుతీరావు చేసిన రెండవ తప్పు. మారుతీ రావు మరణించడంతో ఆయన భార్య గిరిజ ఇప్పుడు విధవగా మారడంతోపాటు దిక్కు మొక్కు లేనిదిగా మారింది. కూతురు గతంలో ఇంట్లో నుండి వదిలి వెళ్ళింది. ఇప్పుడు భర్త ఈ లోకాన్నే వీడదు. 

జీవితాంతం కూతురిని, కట్టుకున్న భర్తను చూసుకుంటూ గడిపేద్దామనుకున్న ఆమెకు ఇప్పుడు ఎవరూ లేకుండా పోయారు. అమ్మే ఇప్పుడు దిక్కుమొక్కు లేనిదిగా అనాధగా మిగిలిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 

ఇలా మారుతీ రావు చేసిన రెండు తప్పులకు ఆయనతో పాటు మరో ఇద్దరు మహిళలు భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు. 

click me!