జిహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్... బడ్జెట్ లోనే స్పీడు పెంచేసిన హరీష్ రావు

By Sree S  |  First Published Mar 8, 2020, 12:51 PM IST

బడ్జెట్ సందర్భంగా హరీష్ రావు ప్రత్యేకంగా హైదరాబాద్ నగరం గురించి ప్రస్తావించారు. హైదరాబాద్ నగరానికి 400 ఏండ్ల చరిత్ర ఉందని, ప్రపంచంలోనే నివాసానికి అత్యంత ఆమోదయోగ్యమైన నగరంగా గుర్తింపు పొందిన నగరమని ఆయన గుర్తుచేశారు. 


నేటి ఉదయం 2020-2021 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. ఆయన తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. 

బడ్జెట్ సందర్భంగా హరీష్ రావు ప్రత్యేకంగా హైదరాబాద్ నగరం గురించి ప్రస్తావించారు. హైదరాబాద్ నగరానికి 400 ఏండ్ల చరిత్ర ఉందని, ప్రపంచంలోనే నివాసానికి అత్యంత ఆమోదయోగ్యమైన నగరంగా గుర్తింపు పొందిన నగరమని ఆయన గుర్తుచేశారు. 

Latest Videos

undefined

సమైక్య పాలకుల అస్తవ్యస్త విధానాల వల్ల హైదరాబాద్ నగర సర్వతోముఖాభివృద్ధి జరగలేదని హరీష్ అన్నారు. హైదరాబాద్ లో జనాభా పెరిగినంతగా సౌకర్యాల కల్పన జరగలేదని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. 

హైదరాబాద్ తో సహా మరో ఆరు నగరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించాలని పలుమార్లు కేంద్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కోరినప్పటికీ ఎటువంటి డబ్బులు రాలలేదని ఆయన తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి వచ్చే 5 ఏండ్లలో 50వేల కోట్లు అవసరమని హరీష్ రావు ఈ సందర్భంగా తెలిపారు. 

మూసి ప్రక్షాళన, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఇతరయాత్రల కోసం ఈ సంవత్సరమే 10 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. అంతే కాకుండా మెట్రో మార్గాన్ని రాయదుర్గం నుండి శంషాబాద్ వరకు బిహెచ్ఈఎల్ నుండి లక్డికాపూల్ వరకు కూడా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు. 

ప్రత్యేకంగా ఇలా బడ్జెట్లో ఎన్నడూ లేనట్టుగా హైదరాబాద్ నగర అభివృద్ధి గురించి మాట్లాడడం ఇతరాత్రాలను చూస్తుంటే... రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలకు తెలంగాణ సర్కార్ ఇప్పటి నుంచే ప్లన్స్ సిద్ధం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. 

ఇంకొద్ది నెలల్లోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సత్త చాటుకోవాలని బీజేపీ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేల ఇలా తెరాస చాలా తెలివిగా పావులు కదుపుతుంది. 

తెలంగాణ అస్తిత్వ నినాదాన్ని ముందుకు తీసుకురావడంతో పాటు, దేశ ఆర్ధిక పరిస్థితి బాగాలేకున్నప్పటికీ తెలంగాణ సర్కార్ అద్వితీయంగా దూసుకుపోతుందని చెప్పడం, ఇతర రాష్ట్రాల కన్నా వేగంగా అభివృద్ధి పథంలో సాగుతుందని చెప్పడం ఒక రకంగా తెరాస సర్కార్ అన్ని విధాలుగా తామే బెస్ట్ అని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. 

ఇప్పటికే కేటీఆర్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉండడం, ఆయన ఐటీ శాఖామంత్రిగా ఉండడం ఇతరాత్రాలతో చాలా దూకుడుగా ప్రవర్తిస్తుండడం కి తోడుగా బడ్జెట్ లో ఇలా అధిక కేటాయింపులు చేయడం వల్ల తెరాస తాము మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేసింది. 

click me!