Ayodhya Verdict: సుప్రీమ్ ప్రయోగించిన అస్త్రం.... ఆర్టికల్ 142

By telugu teamFirst Published Nov 10, 2019, 12:59 PM IST
Highlights

నిన్న సుప్రీమ్ కోర్టు దశాబ్దాలనాటి సమస్యైన అయోధ్య భూవివాదం విషయంలో తన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం ఆర్టికల్ 142 లోని అధికారాలను ఉపయోగించుకొని తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఆర్టికల్ 142 అంటే ఏమిటో చూద్దాము. 

సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలను ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 శనివారం శతాబ్దాల నాటి అయోధ్య భూ వివాద కేసులో చారిత్రాత్మక తీర్పుకు ఎంతగానో దోహదం చేసింది.  తీర్పు చెబుతున్నప్పుడు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం రెండుసార్లు ఈ ఆర్టికల్ 142ను ఉపయోగించి న్యాయం జరిగేలా తీర్పును వెలువరించింది. 

సాక్ష్యాధారాల దృష్ట్యా, వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిని ఒక ఆలయ నిర్మాణం కోసం ఇచ్చినప్పటికీ, ఆర్టికల్ 142ను ఉపయోగించడం ద్వారా మసీదుకు 5 ఎకరాలను మంజూరు చేయమని ఆదేశించింది.

Also read: ఇది అద్వానీ ఘనతే.. 24న అయోధ్యకు వెళ్తున్నా: శివసేన చీఫ్ ఉద్థవ్ థాక్రే

భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ను నిర్మోహి అఖాడా కు ట్రస్టులో భాగస్వామ్యం కల్పించడానికి కూడా ఉపయోగించింది, నిర్మోహి అఖాడాకు కూడా మూడు నెలల్లో కేంద్రం ఏర్పాటు చేయాల్సిన ట్రస్ట్‌లో ప్రాతినిధ్యం లభిస్తుందని తీర్పునిచ్చారు. నిర్మోహి అఖాడా పిటిషన్ ను కోర్టు కొట్టివేసిన ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించే ట్రస్టులో భాగస్వామ్యం కల్పించడం కోసం ఈ ఆర్టికల్ 142ను న్యాయమూర్తులు రెండో మారు ఉపయోగించారు. 

"రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం ఈ కోర్టు తనకున్న అధికారాలను ఉపయోగించి, కేంద్ర ప్రభుత్వం రూపొందించే, ట్రస్ట్ లేదా బాడీలో నిర్మోహి అక్కడకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వవలిసిందిగా ఆదేశిస్తున్నాము", అని  సిజెఐ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌ఐ బొబ్డే, డివై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్‌ఐ నజీర్ లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పునిచ్చింది.

 అసలు ఏమిటీ  ఆర్టికల్ 142...?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు "ఏ కారణం చేతనైనా పూర్తి న్యాయం చేయటానికి" అవసరమైన ఎలాంటి ఉత్తర్వులనైనా జారీ చేయడానికి అధికారాలను కల్పిస్తుంది.

ఆర్టికల్ ఇలా చెబుతోంది: " సుప్రీంకోర్టు తన అధికార పరిధిని ఉపయోగించి ఏదైనా విషయంలో పూర్తి న్యాయం చేయడానికి అవసరమైన ఉత్తర్వులను ఇవ్వవచ్చు. " కాకపోతే దీన్ని అత్యంత ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే వాడాలి తప్ప రెగ్యులర్ గా ఈ అధికరణను ఉపయోగించకూడదు. 

Also read: Ayodhya Verdict: కాశ్మీర్ టు అయోధ్య వయా కర్తార్ పూర్

రామ్ లల్లా విరాజ్మాన్, సున్నీ వక్ఫ్ బోర్డు మరియు నిర్మోహి అఖాడా అనే మూడు పార్టీల మధ్య వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా విభజించాలని ఆదేశించిన అలహాబాద్ హైకోర్టు  తీర్పు వెలువడ్డ 9 సంవత్సరాల తరువాత అయోధ్య భూవివాదం కేసులో సుప్రీమ్ తీర్పు వచ్చింది.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో  నిందితులపై రాయ్ బరేలి కోర్టులో జరుగుతున్న విచారణలు లక్నో కోర్టుకు బదిలీ చేయమని, తద్వారా రెండు కేసుల్లోనూ,వేర్వేరుగా కాకుండా ఉమ్మడి విచారణ చేపట్టవచ్చనే ఉద్దేశంతో కోర్టు ఈ ఆర్టికల్ ను ప్రయోగించి కేసును లక్నో లోని అలాహాబాద్ హై కోర్ట్ బెంచ్ కు బదిలీ చేసింది.  

అలహాబాద్ హైకోర్టు 2010 లో ఇచ్చిన తీర్పును అఖాడా సవాలు చేసింది. శతాబ్దాలుగా  రాముడి భక్తులుగా ఉన్నామని, ఆలయంపై షెబైట్ హక్కులను కోరుకుంటున్నామని(ఆలయ నిర్వహణ, యాజమాన్య హక్కు)  వారు సుప్రీమ్ కోర్ట్ తలుపు తట్టారు. రాముడి ఆస్తిని చూసుకునే మేనేజర్ స్థానంలో మాకు హక్కులు ఇప్పించాలని వారు సుప్రీమ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. 

Also read: రామ్, రహీమ్ భక్తి కాదు.. దేశభక్తి కావాలి: ప్రధాని నరేంద్రమోడీ

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులపై జరుగుతున్న విచారణలో, ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఆర్టికల్ 142 ను అమలు చేస్తూ, రాబరేలి నుండి లక్నోకు వ్యక్తుల విచారణను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 25 సంవత్సరాలుగా కేసు పెండింగ్‌లో ఉన్నందున రాబరేలి నుండి విచారణను లక్నోకు బదిలీ చేసింది.

మరో కేసులో, విడాకులకు మహిళ సమ్మతిని ఇవ్వకపోయినా, గత 22 సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్న దంపతుల వివాహాన్ని రద్దు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆర్టికల్ 142 ను ఉపయోగిస్తూ ఈ ఏడాది అక్టోబర్ లో తీర్పును వెలువరించింది. 

ఇంతకుముందు, ఆర్టికల్ 142 సమాజంలోని వివిధ అణగారిన వర్గాలకు న్యాయం చేయడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి అనేకమార్లు ఉపయోగించారు. తాజ్ మహల్ ప్రక్షాళన కోసం, తాజ్ సౌందర్యాన్ని కాపాడడం కోసం ఈ ఆర్టికల్ 142ను ఉపయోగించారు. చుట్టుపక్కల పరిశ్రమల నుండి సల్ఫర్ పొగ కారణంగా పాలరాయి పసుపు రంగులోకి మారడంతో పర్యావరణ ప్రేమికులు సుప్రీమ్ ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీమ్ ఈ ఆర్టికల్ లో ఉన్న అధికారాలను ఉపయోగించుకొని తీర్పునిచ్చింది. 

Also read: ayodhya verdict: అయోధ్య సమస్యకు సామరస్య పరిష్కారం.. వారికి కోర్టు ప్రశంసలు

ఏకాభిప్రాయం లేదనే సాకును చూపెడుతూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నిర్ణీత గడువు లోపు లోకాయుక్తను నియామించకపోవడంతో  కోర్టు రంగంలోకి దిగింది. జస్టిస్ వీరేంద్ర సింగ్‌ను ఉత్తరప్రదేశ్ లోకాయుక్తగా నియమించాలని 2015 డిసెంబర్‌లో ఉన్నత న్యాయస్థానం ఆర్టికల్ 142 లోని అధికారాలను ఉపయోగించి తీర్పునిచ్చింది. లోకాయుక్త నియామకం ప్రభుత్వ పరిధిలో ఉండే అంశం. ప్రజలకు న్యాయం జరగడం కోసం ప్రభుత్వ పాలనా పరిధిలోకి ప్రవేశించి కూడా కోర్టు తీర్పు చెప్పింది. 

అదేవిధంగా, భోపాల్ గ్యాస్ లీక్ మారణహోమంలో వేలాది మందికి ఉపశమనం కలిగించడానికి యూనియన్ కార్బైడ్ కేసులో కూడా  ఈ ఆర్టికల్ ను కోర్టు ఉపయోగించింది.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ను ఉపయోగించి శిక్షా కాలానికి మించి జైళ్లలో మగ్గిపోతున్న వేలాది మంది అండర్ ట్రయల్ ఖైదీల విడుదల చేసారు. 

click me!