స్టేజీపై అల్లు అర్జున్ కంటతడి: కారణాలు ఇవే....

By telugu team  |  First Published Jan 8, 2020, 5:45 PM IST

అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టుకోవడంతో అందరూ కూడా దీనికి కారణం ఏమిటని చర్చించుకోవడం మొదలుపెట్టారు. అంతే కాకుండా అల్లు అర్జున్ ఈవెంట్ కి చిరంజీవి కానీ, వేరే ఎవరు కానీ రాలేదు. ఈ నేపథ్యంలో అసలు ఈ విషయానికి వెనకున్న కారణాలేంటనే చర్చ సర్వత్రా మొదలయ్యింది.


సంక్రాంతి బరిలో ఉన్న రెండు భారీ సినిమాలో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. సంక్రాంతి పుంజులుగా బరిలోకి దిగుతున్న ఈ రెండు సినిమాల కోసం అభిమానులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. 

సినిమా యూనిట్లు సైతం ప్రజల్లో ఆ బజ్ అలానే కొనసాగించడానికి తీవ్ర ప్రయత్నాలే సాగుతున్నాయి. ఆదివారం రోజున సరిలేరు నీకెవ్వరు టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా...సోమవారం రోజున ఆల వైకుంఠపురం ముసిచల్ కన్సర్ట్ నిర్వహించింది. 

Latest Videos

undefined

ఈ రెండు ప్రోగ్రామ్స్ లో కూడా అసలు సినిమా కాకుండా...వేరే రెండు విషయాలు హైలైట్ అయ్యాయి. సరిలేరు చిత్రం ఫంక్షన్ లో చిరంజీవి విజయశాంతిల రియూనియన్ 

టాక్ అఫ్ ది టౌన్ గా మారగా...ఆల వైకుంఠపురములో ఈవెంట్ లో అల్లు అర్జున్ కన్నీరు పెట్టుకోవడం హైలైట్ అయ్యింది. 

Also read: ఆడవాళ్లు, యుద్ధాలు.. వైరల్ అవుతోన్న త్రివిక్రమ్ డైలాగ్స్!

అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టుకోవడంతో అందరూ కూడా దీనికి కారణం ఏమిటని చర్చించుకోవడం మొదలుపెట్టారు. అంతే కాకుండా అల్లు అర్జున్ ఈవెంట్ కి చిరంజీవి కానీ, వేరే ఎవరు కానీ రాలేదు. 

ఈ నేపథ్యంలో అసలు ఈ విషయానికి వెనకున్న కారణాలేంటనే చర్చ సర్వత్రా మొదలయ్యింది. దీనికి ఇప్పటికే అనేక కారణాలను చెబుతున్నాయి టాలీవుడ్ వర్గాలు. 

సినిమాల్లోకి చిరంజీవి రిఎంట్రీ ఇచ్చిన తరువాత సినిమాలను రామ్ చరణ్ నిర్మిస్తూ ఉండడం ఇక్కడ అసలు సమస్యగా చెబుతున్నారు. ఇంతకుముందు మెగా సినిమాలన్నిటికీ అల్లు అరవింద్ కు చెందిన గీత ఆర్ట్స్ నిర్మాణ బాధ్యతలను చూసుకునేది. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా తయారయ్యింది. 

ఇలా చిన్నగా వచ్చిన పొరపచ్చాలే కొనసాగుతున్నాయని సమాచారం. అందుకోసమే చిరంజీవి కానీ వేరే ఇతర కుటుంబ సభ్యులు కానీ ఈవెంట్ కు రాలేదని అంటున్నారు. మహేష్ బాబు ఈవెంట్ కి వెళ్లిన చిరంజీవి అల్లు అర్జున్ ఈవెంట్ కి రాకపోవడం ఇక్కడ ప్రధానంగా కనబడుతున్న అంశం. చిరంజీవి బిజీగా ఉంది ఉంటె...వేరే ఎవరినైనా పంపించినా సరిపోయేది కదా అనే వారు కూడా లేకపోలేదు. 

ఇకపోతే అల్లు అర్జున్ ఏడవటం గురించి గనుక మాట్లాడుకుంటే..  ఎన్నడు లేని విధంగా తండ్రిని ఉద్దేశించి మాట్లాడుతూ బన్ని ఎమోషనల్ అయ్యాడు. ఇది కాకతాళీయ ఘటనే అందరూ అంటున్నా కూడా దీని వెనక ఏదో మర్మం ఉందనే అనుమానం సగటు వ్యక్తికి రావడం సహజం. 

ఇలా అనుమానం రావడానికి కసరణం, బన్నీ ఏడవడం మామూలుగా కాకుండా చాల ఎమోషనల్ అయ్యాడు. పర్సనల్ రిలేషన్స్ గురించి మాట్లాడుతూ తండ్రి మీద ఉన్న అమితమైన ప్రేమానురాగాలను బయటపెట్టాడు.

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణకు  దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో  సత్కరించాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మహేష్ తండ్రి కృష్ణ అనేంతగా మహేష్ ఎదిగాడని ప్రశంసించారు. 

Also read: అల్లు అర్జున్ అల వైకుంఠపురములో...: పోతన రసాత్మక పద్యం గురించి..

అయితే  ఆ సంఘటన జరిగిన మరుసటి రోజే అల్లు అర్జున్ కూడా తన తండ్రి అల్లు అరవింద్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రి అల్లు అరవింద్ ని పద్మశ్రీ తో సత్కరించాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా తండ్రి తో తనకు ఉన్న అనుబంధాన్ని బన్ని ఈ వేదికపై గుర్తు చేసుకున్నాడు. 

తను పెళ్లి చేసుకున్నా కూడా తండ్రితో కలిసి ఒకే ఇంట్లో ఉండాలని భార్య స్నేహకి పెళ్ళికి ముందే కండీషన్ పెట్టినట్లు చెప్పాడు.   తన తండ్రి స్థాయిలో సగానికి ఎదిగినా చాలని కీలక వ్యాఖ్యలు చేసాడు. 

తండ్రికి థాంక్స్ చెప్పడమే కాకుండా ఎమోషనల్ అయ్యాడు. అల్లు అర్జున్ ఇంత బహిరంగంగా ఇలాంటి వేదికలపై ఎమోషనల్ అయినా సందర్భాలు లేవు. ఈ రెండు సంఘటనలు ఒకదానితరువాత ఒకటి జరగడమే ఇక్కడ జరిగేవాటికి అద్దం పడుతుంది. బన్నీ ఓపెన్ అవడానికి అసలు ఏమిటి కారణం అనే చర్చ ఇప్పుడు మొదలయింది.  

దాదాపుగా ఒక సంవత్సరంన్నర కింద బన్నీ గీతా ఆర్స్ట్ ఆఫీస్ ని వదిలి సొంతంగా తను కూడా ఓ ఆఫీస్ ను నిర్మించుకున్నారు. తన సినిమాలకు సంబంధించిన కార్యకలాపాలన్ని అక్కడ నుంచే కొనసాగించడం జరుగుతోంది. ఆ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు స్నేహ రెడ్డి కూడా న్యూ బెగిన్నింగ్స్ అని పోస్ట్ పెట్టింది. 

ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే కథనాలు ఇంటర్నెట్ ని కుదిపేశాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్ గా అన్నాడా... లేక తానకు తన తండ్రికి మధ్య ఏదో దూరం పెరుగుతుందనే విషయాన్నీ చెరిపేయడానికి ఈ మాటలన్నీ అన్నాడా అనే విషయం మాత్రం తేలాల్సి ఉంది. 

click me!