ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే ఇండియాలోని యువత వారానికి కనీసం 70 గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇటీవల చెప్పారు. అయితే, ఆయన చెప్పినదానికి పలువురు మద్దతు తెలుపగా.. మరికొందరు తీవ్రంగా విమర్శించారు. ప్రముఖ సంస్థ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ సైతం మరో అడుగు ముందుకేసి వారానికి 90 గంటలు పనిచేయాలన్నారు. అంతేకాదండోయ్ ..! ఎంత కాలం భార్యలను చూస్తూ కూర్చుంటారు? అని ప్రశ్నించారు. దీనిపై ఓ టెక్కీ తన బాధను పంచుకున్నాడు. మీరు చెప్పినట్లు చేస్తే అందరికీ తనకు పట్టిన గతే పడుతోందని, వారు చెప్పినట్లుగా చేసినందుకే నా భార్య నన్ను విడాకులు కోరుతోందని ఓ టెక్కీ పరోక్షంగా సోషల్ మీడియా వేదికగా అతనికి ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు.
వారానికి 70 గంటలకు పైగా పనిచేసిన టెక్కీకి చేదు అనుభవం ఎదురైంది. ఇంట్లో సమయం కేటాయించలేపోతున్నాం.. నీకెందుకు పెళ్లి, పెళ్లాం.. విడాకుడుల ఇచ్చేయని అతని భార్య విడాకులు డిమాండ్ చేస్తోందంట. ఇప్పుడేం ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ ఓ టెక్కీ తన ఆవేదనను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. దీన్ని చదివిన పలువురు కంపెనీ యాజమాన్యాలు, ప్రముఖలు చెప్పినట్లుగా పనిచేస్తే తమ భవిష్యత్ ఇలాగే ఉంటుందేమోనంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక తన పోస్టులో పేరు ప్రస్తావించని టెక్కీ.. అధిక పనిగంటల కారణంగా తన జీవితంలో ఎదురైన అనుభవాలను సామాజిక మాధ్యమైన ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సైట్ బ్లిండ్‌లో ఓ పోస్ట్ చేశాడు. అందులో తాను ఐటీ రంగంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని కలలు కని, వాటిని నిజం చేసుకునే క్రమంలో ప్రయత్నంలో మూడేళ్లలు అహర్నిశలు కష్టపడి పనిచేశానని తెలిపాడు. చివరికి ప్రమోషన్ కోసం జూనియర్ నుంచి సీనియర్ స్థాయికి చేరుకున్నాడంట.
అయితే.. జీతం, ప్రమోషన్ పెరిగే కొద్దీ పనిభారం తీవ్రంగా పెరిగిందని చెప్పుకొచ్చాడు. ఏవిధంగా అంటే.. తన విధుల్లో భాగంగా అనేక దేశాల్లో పనిచేసే ఉద్యోగుల్ని కో ఆర్డినేడ్ అతనే చేయాల్సి వచ్చేదంట. ఫలితంగా, ఆఫీస్ మీటింగ్స్ సైతం ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ముగిసేవట. అంతేకాకుండా కొన్ని సార్లు రోజుకు 14 గంటలు కంప్యూటర్ ముందే కూర్చేని పనిచేసేవాడంట. చివరికి రూ.8 కోట్ల పెద్ద ప్యాకేజీ వచ్చిందట. మేనేజర్‌గా ప్రమోషన్ కూడా సాధించాడట.
ఎంత జీతం ఏం సాధించినా ఏం లాభం అన్నట్లుగా అంతా బాగుందిలే అనుకున్న సమయంలో తన భార్య విడాకులు కావాలని అడిగిందట. అందుకు కారణం తానేనని, ఆఫీస్ పని కారణంగా భార్య డెలివరీ సమయంలో అందుబాటులో లేకపోవడం, కనీసం డెలివరీ తర్వాత ఆమెతో గడిపిన సమయం కూడా లేదట. ఇక పిల్లల చిన్న చిన్న శుభకార్యాలు పాల్గొనలేదట దీంతో తన భార్య డిప్రెషన్‌లోకి వెళ్లిందని టెక్కీ చెప్పుకొంటూ వచ్చారు. చివరికి వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లలేకపోయానని ఆ బాధల్ని తట్టుకోలేక తన భార్య విడాకులు కోరుతోందని అన్నాడు టెక్కీ. తనకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదని తన జీవితంలో ఏం కోల్పోయానో కూడా తనను తాను ప్రశ్నించుకోలేకపోతున్నానని వాపోయారు.
ప్రస్తుతం కార్పొరేట్ ఉద్యోగం అంటే దినదిన గండం నూరేళ్లు ఆయూష్ అయిపోయింది. ఎప్పుడు లేఆఫ్ వేసి ఉద్యోగంలో నుంచి ఊడబీకేస్తారో తెలియని పరిస్థితి అని కాబట్టి ఎప్పుడూ ఉద్యోగం, ఆఫీస్‌వర్కే కాకుండా కుటుంబాన్ని పట్టించుకుంటే తనకు పట్టిన గతి మరుకరికి పట్టదని టెక్కీ హెచ్చరిస్తున్నాడు.