చైనా కండోమ్ లు మావాళ్లకు సరిపోవడం లేదు

First Published Mar 2, 2018, 3:12 PM IST
Highlights
  • చైనా కండోమ్స్ చిన్నగా ఉన్నాయన్న జింబాబ్వే మంత్రి

చైనా తయారు చేసే కండోమ్స్.. తమ దేశ పురుషులకు సరిపోవడం లేదని జింబాబ్వే దేశ ఆరోగ్య శాఖ మంత్రి డెవిడ్ పరిరెన్యత్వ అన్నారు. హెచ్ఐవీ/ఎయిడ్స్.. నిర్మూలనపై నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.

‘‘పాపులర్ కంపెనీ నుంచి కండోమ్‌లను మా దేశ యువత కోసం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వాటి సైజ్ తక్కువగా ఉండటం వల్ల యువత ఇబ్బంది పడుతున్నారు. కండోమ్ ప‌రిమాణంపై యువకుల ఫిర్యాదులు మా దృష్టికి వస్తున్నాయి ’’అని ఆయన అన్నారు.

దక్షిణాఫ్రికా ప్రాంతంలో ఎయిడ్స్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో కండోమ్‌లను వాడాలని తాము ప్రచారం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం యువత ఇష్టపడుతున్న కండోమ్‌లను మేము తయారు చేయట్లేదని.. వాటిని చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. 

ఈ విషయంపై చైనా కండోమ్‌ల తయారీ కంపెనీ సీఈవో జావో చాన్‌ సౌత్ స్పందించారు. చైనా మార్నింగ్ పోస్ట్‌తో మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి పలు రకాల సైజులు, ఆకృతుల్లో కండోమ్‌లను వారి కోసం ప్రత్యేకంగా విడుదల చేస్తామని చెప్పారు.

click me!