జగన్ పై దుష్ప్రచారం

First Published Nov 4, 2017, 1:41 PM IST
Highlights
  • జగన్ పై తప్పుడు కథనాలు
  •  ఖండించిన వైసీపీ నేత భూమన

వైసీపీ అధినేత జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారు.  ఈనెల 6వ తేదీ నుంచి జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆయనపై కావాలని దుష్ప్రచారం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. టీడీపీకి మద్దతుగా నిలిచే.. ఓ ఏల్లో మీడియా.. జగన్ పై తప్పుడు కథనాలను ప్రచురించింది. శనివారం ఉదయం జగన్.. తిరుమల శ్రీవెంటకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

అన్యమతస్థులు ఎవరైనా హిందూ దేవాలయాలను దర్శించుకుంటే.. డిక్లరేషన్ ఇవ్వడం సహజం. అదేవిధంగా  జగన్ ని కూడా డిక్లరేషన్  ఇవ్వాలని ఆలయ అధికారులు అడిగినా.. ఆయన పట్టించుకోలేదని, అధికారుల మాటలు ఖాతరు చేయకుండా ఆలయంలోకి ప్రవేశించాడని..దీంతో వివాదం చోటుచేసుకుందని ఓ ఎల్లో మీడియా కథనాలు ప్రచురించింది. ఇప్పడనే కాదు.. జగన్ తిరుమల వెళ్లిన ప్రతిసారి..  ఆ ఎల్లో మీడియా ఇలాంటి వార్తలే ప్రచురించడం గమనార్హం. కావాలని.. జగన్  ఇమేజీ డ్యామేజీ చేసేందుకు ఎల్లో మీడియా వ్యూహాలు రచిస్తోంది. అంతేకాకుండా.. జగన్ తో పాటు వచ్చిన ఓ మహిళా నేత కాళ్లకు చెప్పులు ధరించి ఆలయంలోకి ప్రవేశించిందని కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే.. నిజానికి అలాంటి ఘటనలేమీ జరగకలేదు. ఈ విషయాన్ని ఆలయ అధికారి స్వయంగా ఏషియా నెట్ వెబ్ సైట్ కి  చెప్పడం గమనార్హం.

 ఇదిలా ఉండగా..జగన్ పై వస్తున్న ఆరోపణలను ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. టీడీపీ నేతలు, ఎల్లో మీడియా కావాలనే జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆలయంలోకి చెప్పులు వేసుకొని వెళ్లకూడదనే విషయం తెలియని వాళ్లు తమ పార్టీలో ఎవరూ లేరని చెప్పారు. వైఎస్ ఆర్.. సీఎంగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని చెప్పారు. ప్రతి సంవత్సరం వైఎస్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేవారని గుర్తు చేశారు. ఆ తండ్రి తగ్గట్టుగానే జగన్ కి కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి అని చెప్పారు. అందుకే పాదయాత్ర మొదలుపెట్టడానికి ముందు తిరుమలకే వచ్చారని వెల్లడించారు. శంకుస్థాపనలు, జలహారతులు ఇచ్చేటప్పుడు కాళ్లకు బూట్లు వేసుకునే అలవాటు చంద్రబాబుదే గానీ, వై ఎస్ ఆర్ కుటుంబానిది కాదని స్పష్టం చేశారు.

click me!