ఆంధ్రా అసెంబ్లీ గేట్ ముందు వైసిపి ఎమ్మెల్యేల ధర్నా

First Published Jun 7, 2017, 11:56 AM IST
Highlights

అసెంబ్లీ గేటు ముందు వైసీపీ ఎమ్మెల్యే ల ధర్నా చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఇచ్చారు. మీడియాను తమతో పాటు అసెంబ్లీ లోకి అనుమతించాలన్నది వారి డిమాండ్. వర్షానికి  అసెంబ్లీలో ని  జగన్ కార్యాలయం లీక్  అయిన ప్రదేశాలు పరిశీలించాలని వారంటున్నారు.

చిన్న వర్షానికే అసెంబ్లీ భవనం చిల్లులుపడి కురుస్తుండటంపై ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు నిజనిర్ధారణకు సిద్ధమయ్యారు. మీడియాతో కలిసి అసెంబ్లీ భవనాన్ని పరిశీలించడానికి వారు ప్రయత్నించారు. అయితే, వారితోపాటు మీడియా ప్రతినిధులను అసెంబ్లీలోకి అనుమతించడానికి మార్షల్స్‌ నిరాకరించారు. దీంతో అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ భవనంలోని నిజానిజాలను తెలుసుకోవడానికి తమతోపాటు మీడియాను అనుమతించాలని కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు వద్ద మూతికి నల్ల బట్ట కట్టుకుని ఆందోళనకు దిగారు. 
 
తమకిష్టమైన ప్రైవేట్‌ సంస్థలకు రూ.వందల కోట్లు ధారపోసి.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రాష్ట్ర నూతన శాసనసభ, సచివాలయం చిన్నపాటి వర్షానికే కురవడంపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో ప్రజలకు నిజానిజాలు తెలియాల్సిన అవసరముందని, ఇందుకు అసెంబ్లీ భవనాన్ని పరిశీలించడానికి మీడియా ప్రతినిధులకు కూడా అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. మంగళవారం కేవలం 20 నిమిషాలపాటు కురిసిన సాధారణ వర్షానికే అసెంబ్లీ, సచివాలయం జలదిగ్బంధంలో చిక్కుకోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసెంబ్లీ నిర్మాణంలో అవినీతి జరిగిందని, అందుకే క్వాలిటీ లోపించిందని వారు ఆరోపించారు. వర్షపు నీరు లీకేజి ఎక్కడెక్క జరిగిందో చూడాల్సిన అవసరం ఉంది. సీలింగ్ మొతం కారింది కాబట్టి మీడియాతో సహా వెళ్లి నిర్మాణాన్ని పరిశీలించాల్సిందేనని వారు పట్టుబట్టారు.  

మీడియాకు ప్రవేశం లేదని అధికారులు చెప్పడాన్ని వారు ఖండించారు. మీడియా, అసెంబ్లీలో విడదీయరాని భాగమని, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు మీడియాతో మాట్లాడటం ఆనవాయితే. అందువల్ల మీడియాను అనుమతించాలని ఎమ్మెల్య గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. 

ఏదో తప్పు జరిగింది, దానిని కప్పిపుచ్చుకునేందుకు మీడియాను అనుమతించడం లేదని వారు ఆరోపించారు. మీడియాను అనుమతించే వరకు తాము కూడా వెళ్లమని వారు తెేగేసే చెప్పారు.

 

 

 

 

click me!